అంతిమ సమయం
• ఈ సమయం
సంగమ సమయం.
అంత్య కాలానికి
సంధి సమయం.
• పరమశివుడు భూమి పై
అవతరించిన సమయం.
• తల్లడిల్లేటి పిల్లలను
చేరదీసేటి సమయం.
• ఈ సమయం
సంగమ సమయం.
అంత్య కాలానికి
సంధి సమయం.
• దైవం దా క్షిణ్యమై
శాంతి తో శక్తి నిచ్చు సమయం.
• మానవులకు జ్ఞానంతో
భ్రాంతి తొలిగే టి సమయం.
• పరమశివుని ధ్యానించండి
ఆత్మను శుద్ధి చేయండి.
• పరమాత్మ ను తెలుసుకోండి
పాప కర్మలు చేయకండి.
• ఈ సమయం
అంతిమ సమయం.
నేలను విడిచి
నింగిని చేరే సమయం.
• మాయ కలిగించేది మోహం
అది జీవనానికి శాపం.
• దేహ ప్రీతి యే రోగం
అది దుఃఖానికి ద్వారం.
• బంధాలతో జీవించండి
బంధీలు గా కాకండి.
• బుణాల ను తీర్చుకోండి
విముక్తి ని పొందండి.
• శాశ్వత బంధం శివుని తో
అది కలిగి ఉండడమే మోక్షం.
• ఈ సమయం
సంగమ సమయం.
అంత్య కాలానికి
సంధి సమయం.
• ఈ సమయం
అంతిమ సమయం.
నేలను విడిచి
నింగిని చేరే సమయం.
సంగమ సమయం = కలికాలం చివర, సత్యయుగం ఆరంభ కాలం.
సంధి కాలం = జమ ఖర్చులు (పాపపుణ్యాలు) జీరో చేసుకునే సమయం.
యడ్ల శ్రీనివాసరావు 6 Oct 2023, 5:00 am.
No comments:
Post a Comment