హద్దు లేని ఆకాశం నీ ప్రేమ
• హద్దు లేని ఆకాశం నీ ప్రేమ .
హావభావాలు ఎరుగకనే చూపావు .
ఆనందడోలికలలో ముంచావు .
• హద్దు లేని ఆకాశం నీ ప్రేమ .
• వర్ణన కే రాని అమితం ఈ అద్బుతం
ఎన్ని జన్మల పుణ్యఫలం .
• నా కంటనీరు ఆరుద్రమై
నీ పాదము చేరగా
నా హృదయం తాకేవు .
• నీ స్పర్శ ఎరుగని ఈ తనువు
పుష్ప మై ఊగుతూ ఉంది .
• నా మనసు మైనమై
మౌనం తో నీ కై సాగుతూ ఉంది .
• హద్దు లేని ఆకాశం నీ ప్రేమ .
హావభావాలు ఎరుగకనే చూపావు .
ఆనందడోలికలలో ముంచావు .
• శివ మనే శబ్దం సెలయే రై సాగెను .
నా మది లో మైకాన్ని శుద్ది చేసెను .
• మర జీవము లో మహత్యమే
సంజీవని గా ఇచ్చావు .
• ముల్లోకాల నే మకరందాలు
జ్ఞానం తో చూపావు .
• హద్దు లేని ఆకాశం నీ ప్రేమ .
హావభావాలు ఎరుగకనే చూపావు .
ఆనందడోలికలలో ముంచావు .
హద్దు లేని ఆకాశం నీ ప్రేమ .
హావభావాలు = శరీర భావోద్వేగాలు
మర జీవము = జీవంలో మరణ ఆస్వాదన .
సంజీవని = దివ్య ఔషధం .
ఓం శాంతి
ఓం నమఃశివాయ 🙏.
యడ్ల శ్రీనివాసరావు 12 June 2026 9:00 pm.

No comments:
Post a Comment