Tuesday, June 2, 2026

751. మనసా అలసట మానుకో

 

మనసా అలసట మానుకో



• ఓ  మనసా  తెలుసుకో

  అలసట  మానుకో .

• ఏది  నీదని  వెదికావు

  ఎంతని  అలసి  తిరిగావు .


• ఓ  మనసా  తెలుసుకో

  అలసట    మానుకో .

• ఉన్న  దానితో    ఉండలేవు

  లేని   దానికై    పరిగెడతావు .

  ఎందుకు   నీకీ   అవస్త .

• కోరికలే       గుర్రాలై

  కోమలమే   కఠోరమై

  ఏమిటి   నీకీ   యాతన .


• ఓ  మనసా  తెలుసుకో

  అలసట    మానుకో .


• తెరిచావు    నీ లోని   మాయ ని

  మరిచావు   నీ లోని    శాంతి ని .

• దేహము   తొడిగి

  దేహి దేహి   అంటున్నావు .

• దివ్యత్వం   వదిలి

  దిక్కులు   చూస్తున్నావు.


• నీ   మూలం లోని     శక్తి కి

   సాటి  ఏది  ఉంది .

• నీ   సంకల్పం లోని   యుక్తి కి 

   కాని  దేది   ఉంది .


• ఓ  మనసా  తెలుసుకో

  అలసట    మానుకో .

• ఏది   నీదని   వెదికావు

  ఎంతని  అలసి  తిరిగావు .


• నిర్మలమై   శివుని  చెంత

  నిశ్చలంగా   ఉన్నావు   ఒకనాడు .

• అలజడి  తో   అలమటిస్తు

  గందర  “గోళం” లో   మిగిలావు   నేడు .


• మాయా   మోహలు  నువు

  పూసుకున్న    రంగులు .

• నీ  తనువు   పలచబడ్డాక

  అవి  గేళి చేసి  పోయె   జోరీగ లు .


• ఓ మనసా   తెలుసుకో

  అలసట   మానుకో .

• ఓ మనసా   తెలుసుకో

  అలసట   మానుకో .


యడ్ల శ్రీనివాసరావు 2 June 2026 10:00 AM


No comments:

Post a Comment

751. మనసా అలసట మానుకో

  మనసా అలసట మానుకో • ఓ  మనసా  తెలుసుకో   అలసట  మానుకో . • ఏది  నీదని  వెదికావు   ఎంతని  అలసి  తిరిగావు . • ఓ  మనసా  తెలుసుకో   అలసట    మా...