Monday, June 15, 2026

758. నర్తనం

 

నర్తనం


• భావము లో    భాష్యం 

  గోవిందా    . . . గోవిందా 

• భావము లో    భాష్యం 

  గోవిందా    . . . గోవిందా .


• నడయాడే    నర్తకి   పాదము 

  పలకరించే  

  ధరణి   సంభూతము .

• నగుమోము న    దివ్య  తేజము 

  వికసించే     

  శ్రీరంగ    వైభవము .


• భావము లో      భాష్యం 

  గోవిందా     . . .   గోవిందా 

• భావము లో       భాష్యం 

  గోవిందా    . . .    గోవిందా .


• అభినయ   భంగిమ   చలనము లే

  కైలాసుని    నఖశిఖ    పర్యంతములు .

• కళల     కాణాచి   ఈ నర్తన మే 

  పార్వతి  సిగలో    పారిజాతము .


• గజ్జెలు  మోగే    నాదము లో 

  గమకము   లెన్నో   ఆడాయి . 

• సజ్జన    మేగే      నృత్యం లో 

  జీవము  లెన్నో     తరియించాయి .


• భావము లో     భాష్యం 

  గోవిందా   . . .   గోవిందా 

• భావము    లో    భాష్యం 

  గోవిందా    . . .   గోవిందా .


• నర్తనం     ఆవర్తనం     సంవర్తనం

  నర్తనం     సంకీర్తనం    పరివర్తనం 


• భావము లో     భాష్యం 

  గోవిందా   . . .   గోవిందా 

  గోవిందా   . . .   గోవిందా 

  గోవిందా   . . .   గోవిందా .



🌹🌹🌹🌹🌹


• భావము లోనే మూల సూత్రాలకు నిర్వచనం (భాష్యం) ఉంది . గోవిందా . . .  గోవిందా. 

• నాట్యం చేసె నర్తకి  పాదము తో ,  భూమి పుట్టుకను  పలకరించును .

• ముఖమున దైవ తేజస్సు , శ్రీరంగ నాధుని వైభవం వలే వికసిస్తుంది .

• అభినయం చేస్తున్న నృత్య భంగిమల కదలికలు శంకరుని పాదము నుంచి తల వరకు గల రూపములు .

• వంశ కుల ధర్మమైన ఈ కళా నృత్యం పారిజాత పుష్ప మై పార్వతి దేవి సిగ లో ఉండును .

• కాలి గజ్జెలు చేస్తున్న శబ్ధం లో స్వరాల సముదాయాలు ఎన్నో కలిసి ఆడాయి .

• అలంకార మైన ఈ నాట్యం వలన ఎన్నో జీవులు తరించాయి .

• నాట్యం పాఠం వలే వల్లే వేయు మంచి జీవన విధానము.

• నృత్యం  కధనము గా  విశ్వం లో  మార్పు సృష్టించును.



ఓం శాంతి 

ఓం నమఃశివాయ 🙏 

యడ్ల శ్రీనివాసరావు 15 June 2026 , 2:00 PM.




No comments:

Post a Comment

758. నర్తనం

  నర్తనం • భావము లో    భాష్యం    గోవిందా    . . . గోవిందా  • భావము లో    భాష్యం    గోవిందా    . . . గోవిందా . • నడయాడే    నర్తకి   పాదము   ...