Thursday, June 11, 2026

755. మరిచావా నేస్తమా

 

మరిచావా  నేస్తమా 


• మరిచావా  . . .   మరిచావా

  మై మరిచావా   నేస్తమా .

  మట్టి  వాసనలు  మరిచావా  .

• మంచు  తెరల  ఉదయం లో

  మన బడి పయనం   మరిచావా . . . 


• సూరీడు   పలకరింపు లో

  నీ  చూపులు   చిలకరించడం .

• పైరు  గట్టు   గడ్డి బాటలో

  మన  ఎగుడు   దిగుడు

  అడుగుల   వయనం .

• రబ్బరు చెప్పుల   తడబాటు తో

  రబ్బరు చెప్పుల   తడబాటు తో

  రబ్బరు బొమ్మలా   ఎగిరిన   మన  బాల్యం

  మరిచావా . . .  మై మరిచావా .


• మరిచావా  . . .   మరిచావా

  మై మరిచావా    నేస్తమా

  మట్టి వాసనలు    మరిచావా .

• మంచు  తెరల   ఉదయం లో

  మన  బడి   పయనం  మరిచావా . . .


• తూనీగ ల కై      పరుగులు

  తొక్కుడు  బిళ్ళ లో     తైతక్కలు


• చిన్ని పళ్ళతో      నీ చిర్రుబుర్రులు

  చేతి సంచి తో     మన  చెట్టాపట్టాలు .


• వానలు     నింపిన    సంతోషాలు

  వానలు     నింపిన    సంతోషాలు

  వయనం    తెలియని    మన  కేరింతలు

  మరిచావా  . . .  మై మరిచావా .


• మరిచావా . . .  మరిచావా

  మై  మరిచావా     నేస్తమా

‌ మట్టి వాసనలు    మరిచావా .

• మంచు తెరల   ఉదయం లో

  మన  బడి పయనం    మరిచావా . . .


• భయపెట్టే   బడిలో    దండనలు .

  బిక్కు బిక్కుమంటూ  

  బెల్ కోసం   ఎదురు చూపులు .


• పాల ఐస్ కై      పడిగాపులు

  పీచు మిఠాయి కి   పరుగు పందాలు


• మరిచావా  . . .  మరిచావా

  మై  మరిచావా    నేస్తమా

  మట్టి వాసనలు    మరిచావా .

• మంచు తెరల    ఉదయం లో

  మన  బడి పయనం     మరిచావా . . .





యడ్ల శ్రీనివాసరావు 11 June 2026 10:00 PM



No comments:

Post a Comment

755. మరిచావా నేస్తమా

  మరిచావా  నేస్తమా  • మరిచావా  . . .   మరిచావా   మై మరిచావా   నేస్తమా .   మట్టి  వాసనలు  మరిచావా  . • మంచు  తెరల  ఉదయం లో   మన బడి పయ...