Sunday, June 14, 2026

757. శ్రీ మత్ భగవద్గీత

 

శ్రీ మత్  భగవద్గీత



• భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత గా అభివర్ణించవచ్చు . సమస్త సృష్టి కి బీజ రూపుడు అయిన పరమాత్మ శివుడు , ఈ సృష్టి ని నడిపించడానికి , నియమ నిబంధనల తో కూడిన ధర్మాన్ని రచించాడు . ధర్మం అంటే సృష్టి కళ్యాణం కోసం నిర్మించిన ఆచరణాత్మక విధి విధానాలు , అందులో    ప్రకృతి   పంచభూతాలతో సహ  ప్రతి జీవి , ప్రతి ప్రాణి  కూడా ఒకటికి   మరొకటి సహకరించుకుంటూ, ఏ ఒక్కటీ మరొక దానికి హని కలిగించకుండా జీవించ వలసిన విధి విధానమే ప్రధానం .


• విశ్వానికి హద్దులు లేవు కానీ విశ్వం లో జీవించే ప్రతి జీవానికి హద్దులు పరిమితులు తప్పకుండా ఉన్నాయి . అవి తమ తమ ధర్మానుసారం  జీవించవలసిన అవసరం ఉంది. ఇదే భగవంతుని నియమం. ఇదంతా విశ్వ కళ్యాణం కోసం, ప్రతీ జీవి సుభిక్షంగా జీవించడం కోసం .

• అందుకే భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పండుగల్లో ప్రకృతి , పంచభూతాలు , చెట్టు , పుట్ట , పశువు ఇలా అన్నింటిని గౌరవిస్తూ వాటిని పూజించేలా  అంతర్భాగంగా చేశారు . అవి మూఢనమ్మకాలు కానే కావు .  నేటి కాలం లోని అనేకులకు అందు  ఇమిడి ఉన్న శాస్త్రీయత , సూక్ష్మం, జ్ఞానం తెలియక పోవడం వలన  మూఢనమ్మకాలు గా భావిస్తుంటారు .


 శ్రీమత్ భగవద్గీత

 శ్రీ      =  శ్రేష్టమైన

 మత్  = సలహా

భగవద్గీత = పరమాత్మ ని రచన , భగవంతుని నిబంధన , భగవంతుడు గీసిన హద్దు గీత .


• శ్రీ మత్ భగవద్గీత అంటే శ్రేష్ఠమైన సలహాలతో మానవుని కోసం శివ పరమాత్ముడి సృష్టించిన నియమ నిబంధన . ఆ  నిబంధనలను మనిషి దాటకుండా ఉండడానికి  భగవంతుడు గీసిన గీత గా భగవద్గీత ను  అభివర్ణించవచ్చు . (శివుని యొక్క ఈ  గీతా రచనను , సత్య యుగపు రాకుమారుడు అయిన శ్రీకృష్ణుడు తన దివ్యత్వంతో లోక కళ్యాణార్దం భగవంతుని మాట గా అర్జునుడికి వినిపిస్తాడు . శ్రీకృష్ణుడు ఏ దశలో  కూడా నేనే స్వయం భగవంతుడుని అని చెప్పడు ,  భగవానువాచ అని మాత్రమే చెప్తాడు . అంటే దాని అర్థం భగవంతుడు ఇలా చెప్పాడు అని భగవంతుని దివ్య వాణి ని  శ్రీకృష్ణుడు  వినిపిస్తాడు. భగవంతుడు ఒక్కడే అతడే శివుడు, పరమాత్ముడు)


• ఈ సృష్టిలో అన్ని జీవులు , ప్రాణుల కంటే మానవుడు ఒక ప్రత్యేకం. బుద్ధి, వివేకం , ఆలోచన, జ్ఞానం వంటి లక్షణాలు కేవలం మనిషి కి మాత్రమే ఇవ్వబడ్డాయి. ఒక మనిషి మరొక మనిషికీ అపకారం తలపెట్టిన నాడే ఈ సమస్త సృష్టి అదుపు తప్పుతుంది . వినాశనం వైపు అడుగులు వేస్తుంది . ప్రత్యక్షం గా ప్రస్తుత కాలంలో వంద శాతం జరుగుతున్నది అదే .


 ఈ సృష్టిలో కాలం మొత్తం సత్య , త్రేతా , ద్వాపర , కలి , ఈ నాలుగు యుగాలలో నే తిరుగుతుంది . ( Repeated cycle )


• సత్య యుగం లో ప్రతి జీవి , ప్రతి ప్రాణి , ప్రతి మనిషి భగవంతుని రచన ప్రకారమే జీవించేవి . అందుకే అక్కడ అమితమైన ఆనందం తప్ప దుఃఖం భాధ , అన్యాయం, మోసం అనే పదాలు, వాటి అర్థాలు, వాటి అనుభవాలు కూడా ఏ జీవికి తెలియవు . సత్య యుగం లో అవు పులి కలిసి ఆడుకుంటూ, ఒకే నదిలో నీరు తాగుతాయి . సత్య యుగం , ఆది సనాతన దేవి దేవతా ధర్మానుసారం , ధర్మం నాలుగు పాదాల లో నడుస్తుంది . సత్య యుగాన్ని బంగారు యుగం (Golden Age) అంటారు .


 కానీ కలియుగం లో  ధర్మం పూర్తిగా నశిస్తుంది. భగవద్గీత ను కేవలం ఒక గ్రంథం, పుస్తకం వలే చూడడానికి మినహా ఆచరణకు నోచుకోలేని స్థితిలో మనిషి జీవనం  దిగజారి ఉంటుంది . ఇదే భగవంతుడు గీసిన గీతను ఉల్లంఘించడం . అందువలన అశాంతి దుఃఖం హింస తో జన జీవనం నిండుతుంది . ఏ మానవమాత్రునికి ఇందు మినహాయింపు లేదు. కలియుగాన్ని ఇనుప యుగం (Iron Age) అంటారు . ఈర్ష్య ద్వేషం అసూయ కామం క్రోధం తో మానవ జన్మలు పూర్తి భ్రష్టు మయం అయి ఉంటాయి .

 దీనిని ఉదహరించే , రామాయణం లో ఒక మంచి విషయం చెప్పబడింది . సీత లక్ష్మణుడు గీసిన గీత ను దాటి నందుకు , రాక్షసుడైన రావణాసురుడు మాయా రూపం లో  అపహరిస్తాడు. దుఃఖం, కష్టం లో ఉన్న సీత రామునికై ఎదురు చూస్తుంది . . . 

దీని అర్థం భగవంతుడు  గీసిన గీత , నియమం ధర్మాన్ని కలియుగం లో ప్రతి మనిషి ఉల్లంఘించి దాటడం వలన కలియుగ మాయా  వికారాలలో చిక్కుకొని , వాటికి  వశం అయి , దుఃఖం అనారోగ్యం ఈతి భాధలతో విలవిలాడుతూ తిరిగి భగవంతుడిని రమ్మని ప్రార్థిస్తూ  , రక్షించమని ప్రాధేయపడతారు .


• జ్ఞాన యుక్తం తో అర్దం చేసుకోగలిగితే ,  మనిషి  జీవన రక్షణ కోసం రచించిన సత్యం , జీవన వేదమే భగవద్గీత . 

కురుక్షేత్రం అంటే ఎప్పడో జరిగిపోయిన యుద్ధం కాదు . కలియుగం లో భూమి పై ప్రతి మానవుడు మనసు తో అనుభవించే యుద్ధం. అందుకే అది మహా భారతం .  అందులో  కౌరవులు , పాండవులు ఇంకా  భారతంలో ఉన్న అనేక రకాల పాత్రలు పోషించేది నేడు ప్రత్యామ్నాయ రూపం లో మనమే.


శివుడు కల్పించిన అవగాహన కొద్దీ ✍️ .



రోహిణి  అమావాస్య  ప్రకాశం


ఓం శాంతి 🙏

ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు. 14 June 2026 1:00 PM.


No comments:

Post a Comment

757. శ్రీ మత్ భగవద్గీత

  శ్రీ మత్  భగవద్గీత • భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత గా అభివర్ణించవచ్చు . సమస్త సృష్టి కి బీజ రూపుడు అయిన పరమాత్మ శివుడు , ఈ సృష్టి ని ...