మనో శతకం - 7
ఆడకెన్నడు ఆటల్ మతులతో
జీవితంబాడిన జీవికి జీవంబుండదు.
అవసరంబున గాదు మనుజు అవసరంబు నీవగు.
కాలం కలబడితే కూలబడున్ బ్రతుకు
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా! |18|
భావం:
మనుషుల మనసులతో ఎన్నడూ ఆటలు ఆడకు.
జీవితం కనుక నీతో ఆటాడడం మొదలెడితే నీకు జీవం లేకుండా చేస్తుంది.
నీ అవసరం కోసం మనుషులు కావాలని కోరుకోకు , నీవే మనుషుల కు ఒక అవసరం గా మారు.
కాలం తిరగబడితే బ్రతుకు సర్వనాశనం అవుతుంది.
సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా, సంపన్నుడైన ఈశ్వరా.
🔱🔱🔱🔱🔱🔱
వీడిన వికర్మ జీవించు కాలంబున
చేష్టలుడిగి నాడు కార్యంబు దాల్చు
కాలంబున దేహం కర్మ వదలకుండున్
సత్యంబెరిగి ద్రవించుగొనిన ధన్యుడగున్.
సుందర గుణేశ్వరా! సంపన్నేశ్వరా! |19|
భావం :
చేసిన చెడు కర్మ కాలంలోనే స్థిరంగా జీవించి ఉంటుంది.
చేష్టలు మితి మీరిన నాడు దాని ఫలితం కనపడును.
శరీరం కాలంలో ఉన్నంతవరకు ఎన్ని జన్మలెత్తినా కర్మ వదలదు.
జ్ఞానం తెలుసుకొని కర్మ కరిగించుకున్న వాడు ధన్యుడు అగును.
సుందరమైన గుణములు కలిగిన ఈశ్వరా, సంపన్నుడైన ఈశ్వరా.
యడ్ల శ్రీనివాసరావు 6 Feb 2024, 10:00 pm.
No comments:
Post a Comment