రచయిత
• ఆయా స పడుతోంది కవిత
ఆ ‘యాస’ కై చూస్తోంది రచన.
• ఆశ తో కదిలే పదము కి
శ్వాస యే కరువయ్యెను.
• అభిలాష తో ఎగిరే అక్షరం
అవగాహన లేక క్షరణమయ్యెను.
• ఆయా స పడుతోంది కవిత
ఆ ‘యాస’ కై చూస్తోంది రచన.
• వ్యాకరణ మెరుగని వాక్యం
లయబద్ధం లేని శబ్దం అయ్యింది.
• తేటగీతి లేని ఛందస్సు
నిశి నిండిన చంద్రుడయ్యేను.
• ఆయా స పడుతోంది కవిత
ఆ ‘యాస’ కై చూస్తోంది రచన.
• ఉత్పలమాల తో ఉవ్విళ్లూరే టి పద్యం
చంపకమాల తో చందనం పూసే కావ్యం.
• అతిశయోక్తి లు లేని ఆశ్చర్యార్దకం
మత్తేభ శార్దూల అక్షతల గ్రంధం.
• ఆయా స పడుతోంది కవిత
ఆ ‘యాస’ కై చూస్తోంది రచన.
• ఆయా స పడుతోంది కవిత
ఆ ‘యాస’ కై చూస్తోంది రచన.
క్షరణము = నాశనము.
యడ్ల శ్రీనివాసరావు 27 June 2023 , 4:00 pm
No comments:
Post a Comment