శివోహం
• మనిషి లో కొలువై ఉంది ఆత్మ
శివుని లో నెలవై ఉంది పరమ ఆత్మ.
ఆత్మ పరమాత్మలు జ్యోతి స్వరూపాలు.
అవి అంతము లేని చైతన్య ప్రకాశాలు.
• ఆత్మలు అను పిల్లలకు
పరమాత్మ యే తండ్రి ... అతడు ఒక్కడే.
• ఆత్మ ను ఎరిగిన వానికి
పరమాత్మ తో సంధానం తెలియును.
• శివుడు
చెట్టులో లేడు పుట్టలో లేడు
నీ లోన లేడు నా లోన లేడు
సర్వము వ్యాపించి లేడు.
• శివుడు ఉండేది పరంధామమున.
సంగమ యుగమున ఆత్మల అజ్ఞానం
త్రుంచుటకు జ్ఞాన రూపియై వచ్చును.
• శివుడు శివుడే కాని
నరుడు శివుడు కాలేడు.
• శివుని తత్వము లో
అనుభవాల తో నరుడు శివోహం కాడు.
• భక్తి లో ని భ్రమలకు
మోక్షము ను ఇచ్చేది శివుని జ్ఞానం.
• నిజానంద స్వరూపం శివోహం శివోహం
ప్రకాశ స్వరూపం శివోహం శివోహం
పరమాత్మ స్వరూపం శివోహం శివోహం
ధ్యాన యోగ చైతన్యం శివోహం శివోహం
• మనిషి లో కొలువై ఉంది ఆత్మ
శివుని లో నెలవై ఉంది పరమ ఆత్మ.
ఆత్మ పరమాత్మలు జ్యోతి స్వరూపాలు.
అవి అంతము లేని చైతన్య ప్రకాశాలు.
సంగమ యుగం = కలియుగ అంత్య సమయం.
యడ్ల శ్రీనివాసరావు 25 June 2023 11:00 am
No comments:
Post a Comment