మనిషి - జ్ఞానం
• జ్ఞానమే మార్చెను నా జీవితాన్ని
శాంతమే కలిగెను నా మనసు న.
• జ్ఞానమే మార్చెను నా జీవితాన్ని
శాంతమే కలిగెను నా మనసు న.
• చిద్రమైన మనసుకు
ఆసరా అయ్యేను శివుడు.
ఓర్పు సహనాల తో నేర్పు నే తెలిపేను.
• శిధిలమైన మనిషికి
భరోసా అయ్యేను శివుడు.
మాయా మర్మము లలో గోప్యమే తెలిపేను.
• జ్ఞానమే మార్చెను నా జీవితాన్ని
శాంతమే కలిగెను నా మనసు న.
• ఘర్షణ లతో సాగే బంధాలకు
సంఘర్షణ లు సహజమని.
• స్వార్థం నిండిన మనుషుల కు
నిష్టూరాలు అలంకారమని.
• కాల మే తెలిపెను ఎన్నో అనుభవాలు గా
మాన మే తెలిపెను ఎన్నో అవమానాల తో.
• అవసరాల కోసమే జీవుని ఆరాటమని.
అదే మంచి చెడులు
ఎరుగని బ్రతుకు పోరాటమని.
• హంగుల కోసం వేసేవి
రంగుల ముసుగు లని.
మాటలలో కనిపించేవి
పొంగుల లొసుగు లని.
• మనుషులే తెలిపెను లోక యుక్తి ని.
మౌనమే తెలిపెను దైవ శక్తి ని.
• జ్ఞానమే మార్చెను నా జీవితాన్ని
శాంతమే కలిగెను నా మనసు న.
• చిద్రమైన మనసుకు
ఆసరా అయ్యేను శివుడు.
ఓర్పు సహనాల తో నేర్పు నే తెలిపేను.
• శిధిలమైన మనిషికి
భరోసా అయ్యేను శివుడు.
మాయా మర్మము లలో గోప్యమే తెలిపేను.
యడ్ల శ్రీనివాసరావు 24 June 2023 1:00 pm.
No comments:
Post a Comment