Thursday, June 29, 2023

379. సీతాకోకచిలుక

 

సీతాకోకచిలుక


• సీతాకోక  చిలుక 

  ఎగిరే   రంగుల   వలపా

  చూసి   చూడని   తలపా

  అంది    అందని   బిగువా.


• రెప   రెపలాడే   

  నీ   రెక్కల   సొగసు కి

  టప టపలాడుతు

  నా   రెప్పలు   వేసెను   తాళం.


• తడి బడి  లేచే

  నీ  ఆశల  పల్లకి  కై

  వడి వడి  లాడుతూ

  నా   పాదం   వేసేను   పల్లవి.


• పుప్పొడి  కోసం    

  పడే    నీ  ఆరాటం ...

  ఉత్సాహం    రేపే 

  నా లో    కోలాటం.


• ఆ   కారుమబ్బుల ను    

  తాకాల ని     ఉంది.

  ఉవ్వెత్తు న   ఈ గాలి లో   

  ఎగరాల ని   ఉంది.


• సీతాకోక  చిలుక

  ఎగిరే   రంగుల   వలపా

  చూసి   చూడని  తలపా

  అంది    అందని  బిగువా.


• పూవులపై   వాలిన    

  నీ    వయనం తో

  ప్రకృతి లో    తేలింది    

  నా   ఎద   సరాగం.

• ఏమి భాగ్యం     ఎంత మధురం.


• తుమ్మెద  వై    

  దరి    చేరుతావు

  తూరీగ    లా    

  తుర్రున    జారుతావు.

• ఎంత బింకం      ఏమి జాడ్యం.


• స్వల్పమైన     జీవితమే నా     

   నీ  సంతోషపు   ఏకాంతం.

   అల్పమైన      ఆయుష్షే  నా     

   నీ  ఆనందపు   రహస్యం.


• సీతాకోక  చిలుక

  ఎగిరే   రంగుల     వలపా

  చూసి   చూడని   తలపా

  అంది    అందని   బిగువా.


గమనిక : 

ఒక సీతాకోకచిలుక  ఆయుష్షు 2 నుంచి 3 వారాలు మాత్రమే.


యడ్ల శ్రీనివాసరావు 28 June 2023 5:00 am.









No comments:

Post a Comment

494. Failures Are Accurate Winners

  Failures Are Accurate Winners • అపజయం అనే పదం వినగానే ప్రతి మనిషి లో కలిగేది ఒక భయం, మానసిక ఆందోళన. మనిషి ఏదైతే కోరుకుంటాడో అది పొందక పో...