శివుని తో మనువు
• మాటాడి చూడు
శివుని తో ప్రేమ గా
మాటాడి చూడు.
• మనువాడి చూడు
శివుని తో మనసు న
మనువాడి చూడు
• లీలలు చూపిస్తాడు. లీనం చేస్తాడు.
ఊహించని లోకాన్ని ప్రత్యక్షం చేస్తాడు.
• శివుడే ప్రియుడైతే స్వర్గం నీ సొంతం.
హరుడే హితుడైతే జన్మం సార్థకం.
• పరమేశుని తో పయనం ప్రతి క్షణం రాజసం.
కాలుని కొలువు తో మది మలినాలు మాయం.
• మాటాడి చూడు
శివుని తో ప్రేమ గా
మాటాడి చూడు.
• మనువాడి చూడు
శివుని తో మనసు న
మనువాడి చూడు.
• మహిమని చూపిస్తాడు. మైకం తొలగిస్తాడు.
నీవంటూ ఏమిటో నీకే చూపిస్తాడు.
• పురారి పాశం అమరం.
యుగ యుగాలుగా అది అమరాలయం.
• మురారి గీతం బంధనం.
తర తరాలుగా అది అజరామరం.
• మాటాడి చూడు
శివుని తో ప్రేమ గా
మాటాడి చూడు.
• మనువాడి చూడు
శివుని తో మనసు న
మనువాడి చూడు.
పురారి =శివుడు
పాశం = బంధం
అమరం = మరణం లేనిది.
అమరాలయం= శాశ్వత స్వర్గం.
మురారి = శ్రీ కృష్ణుడు
గీతం = గీతా జ్ఞానం
బంధనం = ముడిపెట్టు, కట్టిపెట్టు.
అజరామరం = శాశ్వతం, స్థిరం.
యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2024 , 9:00 AM.
No comments:
Post a Comment