రూప “అంతరం”
• ఓ మనిషి తెలుసా …
ఇది నీకు తెలుసా.
• భావన లో బలము ఉంది.
భావన లో బలహీనత ఉంది.
బుద్ధి లో నే భావం దాగుంది.
• ఓ మనిషి తెలుసా …
ఇది నీకు తెలుసా.
• ఆలోచన లే బుద్ధి కి మూలం.
ఆచరణ లే తెలివి కి సాక్ష్యం.
ఆస్వాదన లే కర్మ కు ఫలితం.
• ఓ మనిషి తెలుసా …
ఇది నీకు తెలుసా.
తెలిసీ తెలియ కున్నావా.
• వేసే ప్రతి అడుగు
నీ ఉనికి కి ప్రతి బింబం.
• చేసే ప్రతి కార్యం
నీ జీవాని కి నిదర్శనం.
• నిన్ను నీవు ఎరుగకున్నా
దైవం నిను ఎరుగును లే .
• నీవు ఎంత దూరమేగినా
కర్మ నిను విడువదు లే.
• ఓ మనిషి తెలుసా …
ఇది నీకు తెలుసా.
• భావన లో బలము ఉంది
భావన లో బలహీనత ఉంది.
బుద్ధి లో నే భావం దాగుంది.
• ఓ మనిషి తెలుసా …
ఇది నీకు తెలుసా.
• ఆలోచన లే బుద్ధి కి మూలం.
ఆచరణ లే తెలివి కి సాక్ష్యం.
ఆస్వాదన లే కర్మ కు ఫలితం.
• ఓ మనిషి తెలుసా …
ఇది నీకు తెలుసా.
తెలిసీ తెలియ కున్నావా.
• బుద్ధి ఎంత స్వచ్ఛం
బ్రతుకు అంత సత్యం.
• జన్మ జన్మల నుడికారం సంస్కారం.
ఆత్మ శక్తి కి శ్రీకారం పరివర్తనం.
• కాలం లో సమసిపోతుంది దేహం.
రాత ల్లో నిలిచిపోతుంది జీవం.
నుడికారం = రచన, లిఖించబడినది.
యడ్ల శ్రీనివాసరావు 10 Oct 2024 , 8:00 PM
No comments:
Post a Comment