Monday, October 21, 2024

550. మరణ శాసనం

 

మరణ శాసనం


• ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.

  ఏ  జీవం    ఎన్నేళ్ళో.


• విలువ లేని    ప్రాణం

  ఊచకోత    అవుతుంటే  ...

• నిలువ లేని     బ్రతుకు కి

  ఏ  క్షణం     ఏమవుతుందో.


• ఇక   గడిచే    ప్రతి నిమిషం

  నీది   కాదంటుంది   కాలం.

• భవిత     ఎక్కడికో

  తెలుసు  కోమంటుంది   గమ్యం.


• ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.

  ఏ  జీవం    ఎన్నేళ్ళో.


• సూర్యుడు  ఉదయించక  మానడు.

  చంద్రుడు    చిగురించక    ఆగడు.


• నాదన్న   ఈ లోకం లో

  నేనే   లేకున్నా …

• నాదైన      జీవితం

  మరెక్కడో   ఉంటుంది  లే.


• నా    అడుగుల   జాడలో

  నేనే     లేకున్నా

• నావైన     భావాలు

  నాతో     పయనించును లే.


• జననం   తిరిగి రాక   మానదు.

  మరణం     ఆగి    నిలువదు.


• ఏ  ఊపిరి   ఎన్నాళ్ళో.

  ఏ  జీవం     ఎన్నేళ్ళో.


• తెరిచిన     మనసు  లో

  ఇక   ఏమీ   మిగలకుంది.

• కాల మిచ్చిన     సమయం

  ఇక   కొంతే    మిగిలి ఉంది.


• ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.

  ఏ   జీవం    ఎన్నేళ్ళో.


యడ్ల శ్రీనివాసరావు 21 Oct 2024. 11:00 AM.



No comments:

Post a Comment

550. మరణ శాసనం

  మరణ శాసనం • ఏ  ఊపిరి  ఎన్నాళ్ళో.   ఏ  జీవం    ఎన్నేళ్ళో. • విలువ లేని    ప్రాణం   ఊచకోత    అవుతుంటే  ... • నిలువ లేని     బ్రతుకు కి   ...