భక్తి – అను రక్తి
• లాలి పాట తో లావణ్యముగ
యెటుల జోల పాడెద నిను ,
నా వెర్రి గాని …
• మలయ మారుతం నీపై వీచే
వింజామరలు తెచ్చి
నే వెర్రినయితి ….
• సగము కనులతో సాకారమగు నీ చూపు
నిదురా! మెలకువా!
పోల్చ ఎవరి తరమో!
• కొప్పులోన గంగమ్మ సిగలోన సందురుడు
సెమటెక్కడట్టేను
సల్లని నా సాంబునికి.
• ఆకలిగొన్న వని
ఆదరాబాదరా అన్నమట్టుకొచ్ఛెను
కడుపునింప నీకు.
• అన్నపూర్ణ పెనిమిటి వని
మరచి పొరబడితి
అఖిలాండమునకు అన్నమెట్టే నా సామీ.
• ఒంటిగా ఉన్నావని జంట చేరి
నీకు రేయి పగలు కొలిచే
నా మనసూరుకోక.
• నంది నాగ ప్రమధులు చుట్టూతా లెక్క లేరు
ఎప్పుడు విడువరు నిను
రుద్ర శివగణములు.
• సావు పుట్టుకల నడుమ సాకేటి బతుకుకి
వచ్చినపుడు ఏముంది
పోయినప్పుడు ఏముంటుందని
సెప్పకనే సెప్పావు నా దిగంబరా.
🙏ఓం నమః శివాయః.
No comments:
Post a Comment