ప్రేమ నిరతి
• చిరునవ్వుతో చిన్నారి లా
సిగపువ్వుతో సింగారి లా
వన్నె తగ్గని వయ్యారి లా
వెన్న పూసిన వరూధిని లా
• వలపే చాచావే పిల్లా
వయసే తుంచావే మళ్లా.
• సొగసే దాచావే పిల్లా
పరువం పెంచావే మళ్లా.
• నీ కళ్ల లోని కోమలం తో
గుండె లోన గుబులవుతుంది.
• నీ మాట లోని రాగం తో
శృంగారం సంబర పడుతుంది .
• నీ అధరం మకరంద కోశం.
నీ వదనం ప్రవరునికి పాశం.
నీ నయనం తామర తంత్రం.
నీ చుబుకం గారాల సరసం.
• చిరునవ్వుతో చిన్నారి లా
సిగపువ్వుతో సింగారి లా
వన్నె తగ్గని వయ్యారి లా
వెన్న పూసిన వరూధిని లా
• వలపే చాచావే పిల్లా
వయసే తుంచావే మళ్లా.
• సొగసే దాచావే పిల్లా
పరువం పెంచావే మళ్లా.
• నీ బాహువుల బంధం తో
కౌగిలి కలకల మవుతుంది.
• నీ నాభి శ్రావ్యం తో
తపనలు తడబడుతున్నాయి.
• నీ రూపం అజంతా శిల్పం
నీ దర్పం ఎల్లోరా రాజసం
నీ భోగం అప్సర సంభోగం
నీ ప్రేమం మౌన కుసుమం.
• చిరునవ్వుతో చిన్నారి లా
సిగపువ్వుతో సింగారి లా
వన్నె తగ్గని వయ్యారి లా
వెన్న పూసిన వరూధిని లా
• వలపే చాచావే పిల్లా
వయసే తుంచావే మళ్లా.
• సొగసే దాచావే పిల్లా
పరువం పెంచావే మళ్లా.
నిరతి = మిక్కిలి ఆసక్తి, ఇష్టం
తుంచు = ఛేదించు , అధిగమించు
కలకలం = సందడి.
యడ్ల శ్రీనివాసరావు 22 Sep 2024 , 10:00 pm
No comments:
Post a Comment