Thursday, February 9, 2023

307. శివ స్మరణం

 

శివ స్మరణం



• సాగించాలి   కొన సాగించాలి    శివ స్మరణం

  అది యే    ఆత్మకు    అరుణ కిరణం.


• నీవు ఎవరో     నీకు తెలియాలంటే

  సాగించాలి    కొన సాగించాలి    శివ స్మరణం


• శివుడు   ఒక్కడే   పరమాత్ముడు

  శివుని   జ్ఞానమే    మనిషికి    ఆజ్ఞా చక్రం

  అందులోనే దాగి ఉంది    సృష్టి జన్మల రహస్యం.


• సాగించాలి   కొన సాగించాలి   శివ స్మరణం

  అది యే   జీవన చైతన్యానికి   శిరో నామము.


• దేహనేత్రం లో   నిలిచి ఉండేది   మాయ

  జ్జాననేత్రం లో   నిలిచి  ఉండేది   సత్యం.


• బంధాలలో   బందీగా  మనిషి

  ఎన్నో పాత్రలు వేస్తాడు. 

  కర్మలు ఎన్నో చేస్తాడు.

• ఎదో నాడు  తనువును  చాలించి

  తిరిగి  జననం  తీసుకుంటాడు.

• ఇది యే జననమరణ చక్రం ….

  కాలంలో తిరిగే ఆత్మ ప్రయాణం.


• సాగించాలి  కొన సాగించాలి   శివ స్మరణం.


• జన్మలు మారినా   దేహం మారినా

  నీ   ఆత్మ ఒక్కటే.

• రూపం మారిన      పాత్రలు మారిన

  నీ సంస్కారాలు   ఒక్కటే.


• నేటి జీవనం   గత జన్మల  కర్మల  ఫలితం

  నేటి కర్మలే    మరు జన్మకు రూపం.


• ద్వేషం విడిచి     స్వార్థం మరచి

  ప్రేమను పంచి     సేవను పెంచాలి.

  జీవన్ముక్తి కి సాధన చెయ్యాలి.


• సాగించాలి కొన   సాగించాలి  శివ స్మరణం


• జననం సహజం      మరణం సహజం

  నడిమధ్య   నాటకం   సహజం

  ఇది తెలుసుకొని జీవించడమే రాజసం.


• సాగించాలి   కొన  సాగించాలి   శివ స్మరణం

  సాగించాలి   కొన సాగించాలి    శివ స్మరణం


యడ్ల శ్రీనివాసరావు 9 Feb 2023 10:30 pm









No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...