అరుణాచలేశ్వరుడు
• అరుణ చల శివ ఆనంద *శేష
అగ్ని లింగ వాసా *అచలమొక *కర్ష.
• అ రుణము పాపాల హ రణము
చల భ్రమణము జీవుని మోక్షము.
• పౌర్ణమి చంద్రుని తో పూర్ణ శక్తి నిస్తావు
మానసిక దుర్లభం నివృత్తి చేస్తావు.
• అరుణ చల శివ ఆనంద శేష
అగ్ని లింగ వాసా అచలమొక కర్ష.
• రమణులు మోపిన పాదము తో
రమణీయమైనది ఈ యోగ క్షేత్రము.
• ఎల్లలెరుగని శ్వేత జాతీయులు తో
పరమాత్ముడే శివుడని
తెలిపేది రమణుల ధ్యానాశ్రమం.
• అరుణ చల శివ ఆనంద శేష
అగ్ని లింగ వాసా అచలమొక కర్ష.
• దేవతలు సైతం *సూక్ష్మ జీవాలు గా
ప్రదక్షించేను ఈ అరుణాచలమున
• రేయి పగలెరుగక సర్వులు
చేసేరు భ్రమణము శివ సిద్ధి కి.
• అరుణ చల శివ ఆనంద శేష
అగ్ని లింగ వాసా అచలమొక కర్ష.
• అష్ట దిక్కుల నడుమ అష్ట లింగము లతో
వెలసిన
అగ్ని భూతేశ్వర అరుణచల లింగేశ్వర.
• ఆజ్ఞ తో విశ్వ కర్మ చే పృధ్వీ పై నిలిచావు
కల్యాణ కారివై విశ్వాన్ని శుభకరం చేసావు.
• అరుణ చల శివ ఆనంద శేష
• అగ్ని లింగ వాసా అచలమొక కర్ష.
శేష = అక్షింతలు గా ఆశీస్సులు నిచ్చు వాడు.
అచలము = చలనము లేనిది, కొండ.
కర్ష = ఫలము నిచ్చు క్షేత్రము.
సూక్ష్మ జీవాలు = చీమలు, ఈగలు.
యడ్ల శ్రీనివాసరావు 28 Feb 2023 7:00 pm
No comments:
Post a Comment