Wednesday, February 1, 2023

305. శ్రీ గురు మేథా దక్షిణామూర్తి

 

శ్రీ గురు మేథా దక్షిణామూర్తి

( ప్రేరణ : బాల్య మిత్రుడు సుర్ల వెంకట గిరిబాబు ఆధ్యాత్మిక సేవతో తన ఊరి విద్యార్థులకు జ్ఞాన గురువు ఆశీస్సులు లభించాలని సంకల్పం తో 46 కే.జీ పంచలోహ  శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి వారిని రాజమండ్రి లో చేయించే నిమిత్తం, నాకు మార్గ దర్శకుడి గా సేవ చేసే భాగ్యం దొరకడం నా అదృష్టం.

 ఒక జ్యోతిష్కుడు 2013 సంవత్సరం అక్టోబర్ 21 వ తేదీన నాకు దక్షిణామూర్తి ఒక శ్లోకం ధారణ చేసి పఠించమంటే, నేను ఆ నాటి నుండి అర్దం తెలియక పోయినా యధాలాపంగా నిత్యం పఠించే వాడిని. నాడు అక్షరం, సాహిత్యం పై కనీస అవగాహన లేని అల్పుడని.

నేటి ఈ రాత, మాట, అక్షరం శ్రీ గురు దక్షిణామూర్తి భిక్ష అని నా విశ్వాసం.


గురు బ్రహ్మ గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః

  గురు సాక్షాత్ పరబ్రహ్మ  తస్మైశ్రీ  గురువే నమః


• కొలువై న గురువ       కోదండ ప్రభువ

  కోటి విద్యలు  నేర్పేటి   కల్పతరువా


• పాప పుణ్యము  లెరుగక

  కష్ట  నష్టాలు       తాళలేక

• నీ స్మృతి లో   

  జాలువారిన  జీవులకు ...

  చిరు జ్ఞాన దివ్వె తో   

  చీల్చేవు    

  అజ్జాన చీకటిని ...

  వజ్రాల వెలుగుల తో  

  నింపేవు 

  ప్రభల  పరిక్వతని.


• కొలువై న గురువ        కోదండ ప్రభువ

• కోటి విద్యలు  నేర్పేటి   కల్పతరువా


• సకల దుఃఖాల కు   మూలం  అజ్ఞానం.

  దుఃఖ విమోచనమే  దాక్షిణ్య రూపం.

  అది యే  శివసంభూత  రూపం

  శ్రీ మేథా గురు దక్షిణామూర్తి స్వరూపం.


• నిను కొలిచిన   వారికి 

  జీవితాన    సన్మార్గం   దొరికే ను.

• నిను  వేడుకున్న  వారికి

  ధ్యానం తో  వికర్మ లు   కరిగే ను.

• నీ లోని  ఐక్యమైన  వారికి

  జన్మ రహస్యం  తెలిసే ను ...

  మోక్షము పొంది 

  జన్మరాహిత్యం కలిగే ను.


• కొలువై న గురువ       కోదండ ప్రభువ

  కోటి విద్యలు  నేర్పేటి  కల్పతరువా


• గురువు  లేని   మానవుని కి 

  గురుమూర్తి వి   నీవు.

• ధ్యాన   యోగాలతో 

  జ్ఞాన  ధారణ  నిస్తావు.

• స్వీయ  సాక్షాత్కారమిచ్ఛి 

  మానవుని  గురువు గా  చేస్తావు.


• కొలువై న గురువ       శ్రీ దక్షిణామూర్తి

  కోదండ ప్రభువ           శ్రీ జ్ఞాన సంభూత

  కోటి విద్యలు  నేర్పేటి   శ్రీ కురంగపాణి

  కరుణ  చూపవయ్యా   శ్రీ కాశీనాధుడా.



యడ్ల శ్రీనివాసరావు 1 Feb 2023 10:00 PM.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...