Monday, January 30, 2023

304. ప్రేమ

 

ప్రేమ



• ప్రేమ … ఓ ప్రేమ …

  ఊపిరి  నింపే  ప్రాణమా

  మనసు కి   చైతన్యం ఇచ్చే  జీవమా.


• నీ కోసం

  ఎక్కడని వెతికేది 

  ఎంత కాలమని చూసేది.

• రేయి పగలు కి   అలుపవుతున్నా

  దిక్కు  తోచని  చుక్క ల్లే    

  ఎదురు చూస్తున్నా.

  ప్రేమా …  

  నీ రాకకై  వేచి   చూస్తున్నా.


• ప్రేమ … ఓ ప్రేమ … 

  ఊపిరి నింపే ప్రాణమా

  మనసు కి  చైతన్యం  ఇచ్చే  జీవమా


• ప్రేమ లేని    జీవితం   

  దిక్కులెరగని  ప్రయాణం.

  ప్రేమించలేని  జీవితం   

  శూన్యం లో విహారం.


• కన్నీటికి  తెలియదు  ఏనాడూ 

  నా  గుండె భారం ఎంతుందో.

• దేహానికి  తెలిసే   దే నాడో 

  ఈ  ఆత్మ బంధం   ఎన్నటిదో.


• ప్రేమ పొందని  జీవితం 

  పరిపూర్ణం కాని  జన్మం.

• ప్రేమ పంచని  జీవి తో 

  అమావాస్య యే  అనునిత్యం.


• ప్రేమ … ఓ ప్రేమ …

  ఊపిరి నింపే ప్రాణమా

  మనసు కి చైతన్యం  ఇచ్చే  జీవమా.


• నీ కోసం

  ఎక్కడని వెతికేది

  ఎంత కాలమని చూసేది.

• రేయి పగలు కి    అలుపవుతున్నా

  దిక్కు తోచని చుక్క ల్లే    

  ఎదురు చూస్తున్నా

  ప్రేమా … 

  నీ రాకకై   వేచి చూస్తున్నా.


• విశ్వమంత    మనసు కి 

  గుప్పెడు  ప్రేమ  కరువు.

• వెలుగు   ఎంత   నిండి ఉన్నా 

  ఏకాంతమే  మనిషి కి  బరువు.


• కనులు మూసిన  మనిషి కి   ప్రేమ యే కాంతి .

  కడతేరే   మనసు కి     ఊపిరి యే  ప్రేమ.



యడ్ల శ్రీనివాసరావు 30 Jan 2023 10:00 pm










No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...