Monday, January 2, 2023

289. ఒక మంచి మాట - వివాహబంధం


🌹 ఒక మంచి మాట 💐 వివాహ బంధం


• ఈ ప్రపంచంలో వివాహం అనేది జన్మ జన్మల బంధం గా భావించడం జరుగుతుంది. అది కొందరికి యోగం ... ఇంకొందరికి భోగం ... కొందరికి శాపం … మరి కొందరికి బుణానుబంధం...


• జన్మాంతర లలో చేసిన కర్మల (మంచి, చెడు) యొక్క ఫలితం ఈ వివాహ బంధం. అది యోగమైనా, భోగమైనా, శాపమైనా, బుణమైనా ఈ బంధాన్ని గౌరవించడం మనిషి ధర్మం.

• ఎందుకంటే మనిషి స్వయం గా ఆలోచించి ఎంచుకుని తీసుకున్న నిర్ణయం కాబట్టి. వైవాహిక బంధాన్ని గౌరవించడం అంటే భయపడడం కాదు, ఆడంబరం గా చూడడం కాదు, ప్రేమ కురుపించడం కాదు, అవసరాలు తీర్చడం అంత కంటే కాదు. మరి ఇంకేంటి , అంటే … ఆ బంధం పట్ల అనుకూల, ప్రతికూల స్థితుల లో కూడా స్వచ్ఛత తో కూడిన పరిపక్వత కలిగి ఉండడం.

• ఆ స్వచ్చత తో కూడిన ఆలోచనా బుద్ది ని, సంస్కారాన్ని, శక్తి ని ఏ మనిషి కైనా ఇవ్వగలిగేది, శివ పరమాత్ముడు మాత్రమే. శివుని నిత్యం మనసు లో ఆరాధిస్తే … ఎవరికి వారు, తాము ఎవరో, ఏ బంధంతో ఎందుకు ముడిపడి ఉన్నామో తెలుసుకొని గమ్యానికి సులభంగా చేర గలరు. శివ అంటే శుభం.


• నేడు … మనిషి కి ఒకటి దొరికింది, దక్కింది, అనుభవిస్తూ ఉంటే అది మనిషి గొప్పతనం ఏనాటికీ కాదు.

• అదే విధంగా నేడు … ఒకటి మనిషి కి దొరకలేదు, దక్కలేదు, అనుభవించ లేకపోతున్నావు అంటే అది కూడా మనిషి వైఫల్యం కాదు.


• మనిషి జన్మ జన్మలు గా చేస్తూ వచ్చిన కర్మల అనుసారం గా, శివ పరమాత్మడు, మనిషి కి ఏది ఇవ్వాలో అది మాత్రమే ఇచ్చి, మిగిలిన వాటిని తూకం లో పెట్టి మనిషి ని సరిసమానంగా బేలన్స్ చేస్తుంటాడు. ఈ సత్యం తెలుసుకోగలగడం నిజమైన అదృష్టం , ఎన్నో చిక్కు ముడులు లకు కూడా సమాధానం.


• అందమైన గులాబీల లాంటి బంధాల మాటున ముళ్లు నిరంతరం ఉంటూనే ఉంటాయి.


• ఓం నమఃశివాయ 🙏.


యడ్ల శ్రీనివాసరావు 25 Dec 2022 , 9:00 AM.

No comments:

Post a Comment

490. జన గళం

జన గళం • జనమెత్తిన   గళము లో   ఈ పవనం    లేచే  లే. • కదమేగిన    పోటు లో   ఈ కదనం    సాగే  లే. • గుప్పెడు   పిడికిలి   గుండేలే   ఈ   ధై...