Monday, January 23, 2023

300. ప్రాణ చక్రం

 

ప్రాణ చక్రం



• ఒక ప్రాణం విరిసింది 

  బహు రూపాలై వెలసింది

• ఒక కాలం తెలిపింది 

  బహు జన్మల వలయాన్ని


• తూర్పు కనుమ  అరణ్యం లోని  శివుడు

  పురాన ఆలయం లో   ఏకాంతంగా ఉన్నాడు.


• భక్తుల లేమి తో ,  

  శిధిలమవుతున్న ఆలయం లో

  శివుని సేవ తో    ఓ సాధువు ఉన్నాడు.

• ఆలయ స్థితి తో    ఆవేదన చెంది

  శివ సన్నిధిలో అశువులు బాసాడు .


• దిక్కులు మారని సూర్యుడే    దీనికి సాక్ష్యం.

  చుక్కలు నిండిన చంద్రుడే     ప్రతి సాక్ష్యం.



• ఒక ప్రాణం విరిసింది 

  బహు రూపాలై వెలసింది

• ఒక కాలం తెలిపింది 

  బహు జన్మల వలయాన్ని


• సాగర తీరం లో   

  సన్నిధానుడి    వై న   ప్రభు

• నిశి లోని ప్రకృతి కి 

  కాంత దాసుడి  వై న  విభు


• వెన్నెల కాంతిలో   సూర్య నారాయణుడి వై

  దంపతులకు  దర్శన మిచ్ఛిన  నారాయణ

  లక్ష్మి నారాయణ        అభయ నారాయణ

  సాక్షి పారాయణ         శ్రీ సూర్య నారాయణ.


• దిక్కులు మారని సూర్యుడే   దీనికి సాక్ష్యం.

  చుక్కలు నిండిన చంద్రుడే     ప్రతి సాక్ష్యం.



• ఒక ప్రాణం విరిసింది 

  బహు రూపాలై వెలసింది

• ఒక కాలం తెలిపింది 

  బహు జన్మల వలయాన్ని


• గువ్వ గోరింక లల్లే 

  గూడు తో   నిండింది    ఓ జంట

  ప్రేమ నే  ఊపిరి తో 

  పగలు రాత్రులు గడిపారు.


• సతి చెంత సఖుడు 

  సాహితీ  ప్రియు డై నాడు.

  ఆలన పాలన 

  కధల తో కవితల తో సాగించాడు.


• ప్రేమ పక్షులు గా 

  ఆలుమగలు అంబరాన్ని తాకగా

• కాలం కాలనాగై   సఖుడను కబళించింది.

  సతికి శోకము మిగిలింది.


• దిక్కులు మారని సూర్యుడే  దీనికి సాక్ష్యం.

  చుక్కలు నిండిన చంద్రుడే    ప్రతి సాక్ష్యం.



• ఒక ప్రాణం విరిసింది 

  బహు రూపాలై వెలసింది.

• ఒక కాలం తెలిపింది 

  బహు జన్మల వలయాన్ని


• ప్రేమ  ఎరుగని   ప్రవరుడు

  స్నేహ  మెరుగని వరూధిని

• ఉన్నారు … ఉన్నారు…. 

  అపరిచితులు లై ఉన్నారు.

• తోడు నీడ లని   తెలియక

  నిత్యం  ఎదురవుతునే  ఉన్నారు.


• ప్రవరుని   చూసిన  తొలి చూపులో

  వరూధిని కి  ఏదో తెలియని  అనుబంధం.

• ప్రవరుడికి   మాత్రం   అది    సహజ బంధం.


• ఉన్నారు … ఉన్నారు…. 

  అపరిచితులు లై ఉన్నారు.

• తోడు  నీడ లని   తెలియక

  నిత్యం  ఎదురవుతునే  ఉన్నారు.


• ఓ నాడు వరూధిని 

  గమ్యం మారింది  … దూరం అయ్యింది.

• ఆ నాడే ప్రవరుని కి  

  తనలోని   ప్రేమ   తెలిసింది.


• వరూధిని కై 

  వెతుకులాడుతూ … వెతుకులాడుతూ

• ప్రవరుడి   ప్రాణం   కాలం లో  కలిసింది.


• జన్మ జన్మలు గా చూస్తున్నాడు

  ఎదురు  చూస్తూ నే  ఉన్నాడు.

  వరూధిని కోసం


• దిక్కులు మారని  సూర్యుడే  దీనికి సాక్ష్యం.

  చుక్కలు నిండిన  చంద్రుడే    ప్రతి సాక్ష్యం.



• ఒక ప్రాణం విరిసింది 

  బహు రూపాలై వెలసింది

• ఒక కాలం తెలిపింది 

  బహు జన్మల వలయాన్ని


• ఓ పండిత పుత్రుడు        పామర శ్రేష్టడు

  వేదా మంత్రాల తంత్రాల    సంతుష్టుడు.


• జ్ఞాన సముపార్జన చేసి     అజ్ఞాని యై

  అహంకారంతో  తండ్రి ని   నిందించాడు.


• గర్వం తో   సోదరీ సోదరులను  విస్మరించాడు

  బంధాలు  విడిచి   చివరికి ఏకాకి గా నిలిచాడు.


• దిక్కులు మారని సూర్యుడే  దీనికి సాక్ష్యం.

  చుక్కలు నిండిన చంద్రుడే    ప్రతి సాక్ష్యం.



• ఒక ప్రాణం విరిసింది 

  బహు రూపాలై వెలసింది

• ఒక కాలం తెలిపింది 

  బహు జన్మల వలయాన్ని


• ఓ అంద గాడ   …  ఓ చందు రూడా

  ఎదురే  లేని   సుందరాంగుడా


• మన్మధుడై పుట్టాడు    మనసులనే దోచాడు

  ఉన్నతి గా ఎదిగాడు    దేశాలలో తిరిగాడు


• ఓ అంద గాడ … ఓ చందు రూడా

  ఎదురే లేని    సుందరాంగుడా


• కాలమంతా 

 తన వృత్తి లో మునిగాడు … చక్రం తిప్పాడు

• రారాజు గా ఎదిగాడు.

  కుటుంబాన్ని   విస్మరించాడు.

  అర్ధాంగి కి ఆవేదన నిచ్చాడు.

  పిల్లలకి అవసరాల వస్తువు గా మిగిలాడు.

  జీవితం మంటే ఇంతే అనుకున్నాడు.


• ప్రేమ పంచని పగవాడి లా …

  ప్రేమ పొందక యంత్రగాడి లా …

  అర్ధాంతరంగా తనువును చాలించాడు.


• దిక్కులు మారని సూర్యుడే  దీనికి సాక్ష్యం.

  చుక్కలు నిండిన చంద్రుడే   ప్రతి సాక్ష్యం.



యడ్ల శ్రీనివాసరావు 22 Jan 2023 10:00 PM.





No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...