Friday, January 6, 2023

294. ప్రేమ కోశము

 

ప్రేమ కోశము




• ప్రేమ   ఓ   ప్రేమ

  పరవశానికే   ఓ   చిరునామా

  మనసుల    కలయిక యే    నీ  సందేశమా.


• చిరు   జల్లులే   అనురాగాలై

  చిరునవ్వులు   కురిపిస్తుంటే

• గుసగుసలాడే  గువ్వల లే

  కలిసి  మెలసి   ఉండాలి.


• చిటపటలాడే   చినుకు లలే

  చిర్రుబుర్రు లాడుతు ఉంటే

• తడవని  తనువుల  వర్షమే  ఈ ప్రేమ.


• ప్రేమ   ఓ   ప్రేమ

  పరవశానికే  ఓ  చిరునామా

  మనసుల    కలయిక యే    నీ  సందేశమా.


• అల్లుకున్న  పందిరి   తీగ ల్లే

  అనుబంధం   విరిసింది

  ప్రేమ  బంధమై   కలిసింది.

• పెనవేసుకున్న   కొంగు పైట ల్లే

  కర్మ బంధం   ముడిపడింది

  లాలి బంధమై  ఆడుతుంది.


• అనుభవం  కాని  ఆనందం

  ప్రేమ  అయి   నడిపిస్తుంటే.

• తెలవారే   ఉదయం   కోసం

  కోటి   ఆశలతో   చూస్తున్నాను.


• ప్రేమ    ఓ   ప్రేమ

  పరవశానికే   ఓ  చిరునామా

  మనసుల  కలయిక యే   నీ   సందేశమా


• ఆధారం లేని    ఆత్మీయత తో

  దిశ  లేని  ప్రేమ   పుంతలు   తొక్కుతుంటే

• దారము లేని   గాలిపటం లా  జీవితం

  అనంత  లోకాలకు  పయనిస్తుంది.


• మాటలు  పెగలని   చెలి  మనసు

 మౌనమ నే  అలంకారం తో   మూగపోతే

• రెక్కలు  తొడిగిన   ప్రేమ

  రెపరెప లాడుతు  గాలిలో

  ఎగురుతు ఉంది 

  ఎటో   ఏటో   ఎగురుతూ  నే  ఉంది.


యడ్ల శ్రీనివాసరావు 6 Jan 2023 10:00 PM .














No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...