జ్ఞాన సరస్వతి
వసంత పంచమి
• జనియించెనే తల్లి జనియించెనే
అజ్ఞాన అంధకారుల కోసం
కరుణతో జనియించెనే.
• జగదాంబ రూపమున ఉదయించెనే
జ్ఞాన సరస్వతి అయి అవతరించెనే.
• బీజాక్షరాల కు మూల రూపిణీ యై
దీర్ఘాల ఒత్తుల్లో హచ్ఛుల్లో హల్లు ల్లో
శక్తి నిక్షిప్తం చేసిన అమృత స్వరూపిణి.
• జనియించెనే తల్లి జనియించెనే
అజ్ఞాన అందకారుల కోసం
కరుణతో జనియించెనే.
• తల్లి మీటిన వీణలో
తంతి స్వరము లే వరములు
అవి హృదయము ను తాకగా
నరములు పలుకు *గణములు.
• వేదాల మంత్రాల తంత్రాల సృష్టి తో
యంత్రాలను నడిపించే శక్తి రూపిణీ.
• జ్ఞాన శాస్త్రము ల ధారణ తో నరుడిని
నారాయణుడి గా చేసేటి విద్యా రూపిణీ.
• జనియించెనే తల్లి జనియించెనే
అజ్ఞాన అంధదకారుల కోసం
కరుణతో జనియించెనే.
• కళలలకు *కాణాచి యై
బుద్ధి కి సిద్ది యై
వాక్ కు *ఊతమై
ప్రతిభ కు పుస్తకమైన వీణాపాణి
• కన్నులకు కాంతి యై
*కరములకు కలము యై
కవితలకు జీవమై
కలకాలం ప్రాణమై కరుణించు *కదంబరీ.
• జనియించెనే తల్లి జనియించెనే
అజ్ఞాన అంధదకారుల కోసం
కరుణతో జనియించెనే
• జగదాంబ రూపమున ఉదయించెనే
జ్ఞాన సరస్వతి అయి అవతరించెనే.
• అక్షర మై విశ్వా న విహరించె శ్రవణి
మూలాధార క్షేత్రానికి మూల నక్షత్రిణి
జ్ఞాన బ్రాహ్మణి.
• నిర్మలం నిశ్చలం నిధీశ్వరం.
శ్రావ్యం సుందరం జగదీశ్వరం.
వేదం నాదం విభుదీశ్వరం.
గణములు = అక్షరాల గుంపు య,మ,త,ర,జ,భ,న,స.
కాణాచి = చిరావాస స్థానము, మూల స్థానము.
ఊతం = బలము, పట్టు, ఆధారం.
కరములు = చేతులు.
కదంబరి = సరస్వతి దేవి, ఆడ కోకిల.
యడ్ల శ్రీనివాసరావు 25 Jan 2023 , 12:00 PM.
No comments:
Post a Comment