జీవ శ్రవణం
• ఏ బంధం ఎన్నాళ్ళో … ఎవరి బుణం ఎన్నేళ్ళో
ఏ జీవం ఎన్నాళ్ళో ... ఎవరి పయనం ఎన్నేళ్ళో
• ఆత్మ నెరగని వాడు ఎన్ని రంగులద్ధినా
జీవన రంగమంతా చివరికి “చెద” రంగమే.
• పరమాత్మ నెరిగిన వాడు ఎన్ని జన్మలెత్తినా
జీవిత వదనమంతా నిత్య “శుభ” సంకల్పమే.
• ఏ బంధం ఎన్నాళ్ళో … ఎవరి బుణం ఎన్నేళ్ళో
ఏ జీవం ఎన్నాళ్ళో ... ఎవరి పయనం ఎన్నేళ్ళో
• బంధాల బాటలో దాగి ఉంది బతుకు నాటకం
వీడినాకే తెలిసేది అది అంతా ఒక బూటకం.
• పిడికిలి బిగువు లో పెనుగులాటలు
వదిలితే నే అవి జీవన మకరందాలు.
• ఏ బంధం ఎన్నాళ్ళో … ఎవరి బుణం ఎన్నేళ్ళో
ఏ జీవం ఎన్నాళ్ళో ... ఎవరి పయనం ఎన్నేళ్ళో
• శివుని పొందని బ్రతుకులోన
అతుకులన్నీ అతలాకుతలమే.
• నరుడు పొందిన ధనము తో
దొరికేది అల్ప కాల సంతోషమే.
• సేవ చేయని దేహము
ఉనికి కోల్పోయిన ప్రాణము.
• శక్తి నిలిచిన శరీరం
శుభ కార్యాల చైతన్యము.
• ఏ బంధం ఎన్నాళ్ళో … ఎవరి బుణం ఎన్నేళ్ళో
ఏ జీవం ఎన్నాళ్ళో ... ఎవరి పయనం ఎన్నేళ్ళో
• పంచిన ప్రేమ లే పెరిగిన మమతలు
ఈ మురిపాల బంధాలు.
• విడనాడిన నాడు గుండె కోత లతో
గడిచేను జన్మాంతరాలు.
యడ్ల శ్రీనివాసరావు 18 Jan 2023 , 9:00 pm.
No comments:
Post a Comment