శ్రీ గణనాధ
• శ్రీ వరధాయక శ్రీ వినాయక
శ్రీ కరనాధక శ్రీ గజానన
• కొలువు తీరిన గణుడా
కోటి విఘ్నములను ఆపువాడ
• వరముల సిద్ధికి అభయము నిచ్చే
ఆది దేవుడా ఈశ్వర రూపుడా
• శ్రీ విఘ్నేశ్వరుడా శ్రీ ద్వి దేహుడా
• గుణములు తెలియని గణముల తోడనే
గతిని మరచి నీ గిరినే తిరుగుతున్నాము
• స్థితమున చేరిన వక్రబుద్ధి ని
సక్రమ స్థిమితం చేయి బుద్దీశ్వరుడా
• శ్రీ గణనాధుడా శ్రీ గణేశుడా
• శ్రీ వరధాయక శ్రీ వినాయక
శ్రీ కరనాధక శ్రీ గజానన
• సూక్ష్మ బుద్ధితో మోక్షము నిచ్చే
మూలాధారాన ఆవాసించే కైవల్యనాధుడా
• మూషిక వేగా న పాదరసం లా
మస్తిష్కం లో జ్ఞానం నింపే లంబోదరుడా
• శ్రీ వినయ నాధుడా శ్రీ ఆది దేవుడా
• వందనం శతకోటి వందనం.
నందనం సుమభాష నందనం.
యడ్ల శ్రీనివాసరావు 4 Jan 2023, 10:00 AM
No comments:
Post a Comment