Sunday, January 15, 2023

297. సుమధుర సమయం

 

సుమధుర సమయం



• ఎంత మధురం      ఈ జీవితం

  ఎంత సుందరం     ఈ సమయం


• ఆశలలో ఆనందాలు     జీవనానికి ఇంధనాలు

  ఊపిరి లో ఉద్వేగాలు    ప్రేమ లోని పరవశాలు


• కాలం తో   కలిమి   చేసాక

  కలతలు   కనుమరుగవుతుంటే

• జీవం తో   కలిసిన   నా మనసు

  పరవళ్లు   తొక్కుతోంది.


• ఎంత మధురం     ఈ జీవితం

  ఎంత సుందరం    ఈ సమయం


• గతం లోని    గాయాలన్నీ

  గాలి  లో      ఆవిరవుతుంటే

• నీటి  లోని    నా నీడ

  చిరునవ్వు తో    చిందేస్తుంది.


• నిప్పు లోని  ఈ  వెలుగు

  జీవిత   రహదారవుతుంటే

• నేల లోని  ఈ  నెలవు

  నను  వదలను  అంటుంది.


• ఎంత మధురం     ఈ జీవితం

  ఎంత సుందరం    ఈ సమయం


• కంట జారే    కన్నీరు 

  “ఇక పని ఏముంది” … అంటుంటే.

• అలసి సొలసిన   దేహం

  “నాకు భరో‌సా ఎందుకు” … అంటుంది.


• పయనం లో     పరీక్షలన్నీ

  జవాబు లున్న    ప్రశ్నలు

• శూన్యానికి   చేరువైతే

  జగమే  జవాబు  ఇస్తుంది.


• ఎంత మధురం       ఈ జీవితం

  ఎంత సుందరం      ఈ సమయం


నెలవు = స్థానం,  పరిచయం


యడ్ల శ్రీనివాసరావు 15 Jan 10:30 PM






No comments:

Post a Comment

650. జాలి దయ కరుణ బలమా? బలహీనతా?

జాలి  దయ  కరుణ  • జాలి దయ అనేవి  దైవీ గుణాలు . జాలి దయ లేని   మనిషి ని  కర్కోటకుడు, క్రూరుడు , అసురుని గా పరిగణిస్తారు. నిజమే కదా . . . ...