Monday, December 26, 2022

288. ఏమి మనుషులో

 

ఏమి మనుషులో



• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

  ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి….

  నడిచే నాటకం లో   

  నీవొక నటుడి వని  తెలిసినా

  రక్తి కట్టించలేని    

  రంగస్థలం  నీ జీవితం.


• రంగులు పూసిన  

  హంగులు దిద్దిన  

  నీ నవ్వు ల   వెనుక  కనపడుతుంది   

  ఈర్ష్య ద్వేషాల  విషవలయం.


• ఇంత కన్నా 

  ఏమి సాధించావు    ఏమి శోధించావు


• సాక్షి వి  కాలేని  

  నీ మాటకు ….  నీ ఆలోచనకు

  మనస్సాక్షి   లేని   జీవితమే రా   

  నేటి   నీ  జన్మకు  సాక్ష్యం.


• ప్రేమ  ల్లో     మోసాలు      

  గుండె ల్లో    భారాలు ...

  స్నేహ ల్లో    మాయలు    

  మనుషులతో   ఆటలు.


• ఇంత కన్నా 

  ఏమి సాధించావు   ఏమి శోధించావు.


• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

  ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి

  జీవితమంటే   వ్యాపారం  కాదురా

  లెక్కలు    వేయడానికి

  తేడా చేస్తే   మరు జన్మ కూడా 

  తారు  మారే  కద రా


• చెదలు  నిండిన   మెదడు తో 

  చదరంగం    ఎన్నాళ్ళురా ...

  చిక్కి   శల్యం     అయ్యాక  

  నీలో  మిగిలేది  చెత్తే  కదరా


• ఇంత కన్నా 

  ఏమి సాధించావు   ఏమి శోధించావు

 

• యేరు దాటాక   

  తెప్ప తగలెయ్యకు రా ...

  ఊరు దాటాక   నీ  దేహాన్ని 

  కాడు తరిమెస్తుంది రా


• మాయలో మునిగి తే 

  మర్మం    ఎన్నటికి   తెలిసేది రా

  మనసు  తెరిచి  చూడరా 

  శివుని   బాట    తెలియును రా


• ధనం    ఎంతున్నా  

  నీ  దారిద్ర్యం   తీరేనా

  భోగం      ఎంతున్నా 

  నీ రోగం    నయమయ్యేనా.


• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

  ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి

  పూటకో  నాటకం లో  ఆరితేరావు

  నటకిరీటి  వై   చెలరేగుతున్నావు.


• సిగ్గు లేని   జీవితానికి   తెర ఎత్తావు

  హద్ధు లేని  అలవాట్లకు  బానిస అయ్యావు.


• ఏమి మనుషు లో …. ఏమి మనసు లో

   ఏమి బ్రతుకు లో


• ఓ మనిషి

  ఇంత కన్నా 

  ఏమి సాధించావు   ఏమి శోధించావు


యడ్ల శ్రీనివాసరావు 26 Dec 2022 7:30 pm







No comments:

Post a Comment

618. వెలుగు రేఖలు

  వెలుగు రేఖలు   • ఎన్నో   జన్మల    భాగ్యం   ఈ   వెలుగు   రేఖలు  . • అలసిన    వారే      తీరం    చేరును .   సొలసిన   వారికే    అమృతం   దొరక...