వికసిత
• వికసిత వదన కుసుమిత సదన
చెకుముకి చెలియా
ఇదే ఇదే నా సుమాంజలి.
• ఊహలోన కలిశావు
కనుల ఎదుట మెరిశావు
కలలకు జీవం పోశావు
కాలంలో కరిగి పోయావు.
• నీ అందంతో ఆకాశం లో విహరించి
ఆనందాన్ని ఆస్వాదించా
• నీ మౌనం తో మలయం లో సంచరించి
స్వేదం పట్టని సేదను పొందా
• చెకుముకి చెలియా జీవన సఖియా
తవనత ప్రణయా
ఇదే ఇదే నా హృదయాంజలి
• నీ కాలం లో నే లేనే లేను
కానీ నే ఏకాకి ని కాను.
• నాతలపు లో నిలిచి ఉన్నావు
ఊపిరి వై కలిసి ఉన్నావు
• తవనత ప్రణయా నదమున నదియా
సరసన సరయా
ఇదే ఇదే నా ప్రేమాంజలి
• నీ కోసం వస్తాను నీ తోనే ఉంటాను
నీ లోనే కరిగి కనుమరుగై “పోతాను”.
మలయము = ఉద్యానవనం, తోట
తవనత = క్లుప్త కాలం
ప్రణయ = ప్రేమ, పరిచయం, ప్రీతి.
నదము = ప్రవహించే జలపాతం
నదియా = ఆశ
సరయు = చల్లని గాలి
యడ్ల శ్రీనివాసరావు 23 Dec 2022 , 10:30 pm.
No comments:
Post a Comment