సాగర నెమలి
• ఈ సాయం సంధ్య సమయంలో
పాడింది రవళి … పలికింది మురళి
సంతోషం తో సాగింది సాగర సరళి
• ఈ పౌర్ణమి రాతిరి సమయం లో
పిలిచింది నళిని … చూసింది హరిణి
ఆనందం తో ఆడింది వనమున నెమలి.
• తీరం లో రేణువులు గానానికి గమకాలై
ఎగిరి ఎగిరి నాట్యం చేస్తున్నాయి.
• వెన్నెల్లో మిణుగురులు శ్రావ్యానికి సంబరమై
తహ తహ మెరిసిపోతూ ఉన్నాయి.
• ఈ సాయం సంధ్య సమయంలో
పాడింది రవళి … పలికింది మురళి
సంతోషం తో సాగింది సాగర సరళి
• ఈ పౌర్ణమి రాతిరి సమయం లో
పిలిచింది నళిని … చూసింది హరిణి
ఆనందం తో ఆడింది వనమున నెమలి.
• ఉరకలు వేసే అలలు ఉవ్వెత్తున లేచాయి
ఇసుక రేణువులను ముంచాయి.
• ఆకలి గొన్న కీటకాలు దాడులు చేసాయి
మెరిసే మిణుగురులను మింగాయి.
• మురళి మూగ బోయింది … రవళి రాగం ఆగింది
• నళిని కుంగి పోయింది … హరిణి వెడలి పోయింది
• సాగుతోంది సాగర సరళి
అదోలా అదేదో లా … అదేదో లా
• ఆడుతోంది వనమున నెమలి
అదోలా అదేదో లా … అదేదో లా
• రవళి = శ్రావ్య శబ్దం
• మురళి = పిల్లనగ్రోవి
• నళిని = తామర పువ్వు
• హరిణి = ఆడ జింక, అప్సరస
యడ్ల శ్రీనివాసరావు 21 Dec 2022 9:00 pm
No comments:
Post a Comment