హేమంతం
• ఓ హో హో … ఆ హ హ
హాయిని కలిపే కాలం ఈ శీతాకాలం
మేనికి లాలన కాలం ఈ చల్లని కాలం.
• వీచే గాలుల కు
పూచే కొమ్మలు తోడై న
సుందరం ఈ సోయగం ... ఈ హేమంతం.
• ఓ హో హో … ఆ హ హ
హాయిని కలిపే కాలం ఈ శీతాకాలం
మేనికి లాలన కాలం ఈ చల్లని కాలం.
• తొలి పొడుపు న సూర్యుని రాగం
నుని వెచ్చగా తాకే ఈ ప్రకృతి పాదం.
• తొలి మంచు లో తడిసిన తానం
సుతి మెత్త గా పెరిగే ఈ పూల వనం.
• ఓ హో హో…ఆ హ హ
హాయిని కలిపే కాలం ఈ శీతాకాలం
మేనికి లాలన కాలం ఈ చల్లని కాలం.
• నీటి బిందువుల నయగారం
చిగురుటాకు న జారుతు ఉంటే
నిశి లో నానిన నీలాంబరి
నింగి ని చూస్తూ భారం గా రెక్కలే విరిచింది.
• గరిక పై నిలిచిన
ఈ మంచు ముత్యాల హారం
తెల్లని చీర వలె
ప్రకృతి కాంత కు సింగారం .
మేని = శరీరం
లాలన = మృదువైన
తానం = స్థానం, స్థలం, స్నానం.
నయగారము = సొగసు, వన్నె, అందం.
నిశి = రాత్రి
నానిన = నీటిలో తడిచి ముద్దైన
గరిక = గడ్డి
యడ్ల శ్రీనివాసరావు 1 Dec 2022 11:00 PM.
No comments:
Post a Comment