స్వామి నీ రాజనం
• సస సస సస సస సస సరిగ సరిగ సరిగ
ససరిగ రిగ రిగ సరిగ సరిగ ససరిగ
సరి సరి రిగ రిగ సరిగ సరిగ సరిగ…..
• స్వర రాగ నీ రాజనం … స్వామి
స్వర శేష నీ భాషణం.
• శుభ కల్ప నీ స్వరూపం … స్వామి
శుభ పీత నీ భూషణం.
• సర్వ శ్రేష్టంబు నీ విమలము … స్వామి
సర్వ శ్రీ కరం నీ విరజమానం.
• సత్య జ్ఞానతః నీ గీర్వాణము … స్వామి
సత్య విజ్ఞత నీ నిర్వాణము.
• సత్వ శోభిత నీ ప్రేమము … స్వామి
సత్వ సంశుద్ది నీ దివ్యము.
• స్వామి … స్వరం లోని ఈ రాగం నీకు హారతి (నీరాజనం)
నిను పలుకు (భాషణం) స్వరాలు (స్వర) నీవు అనుగ్రహించి ఇచ్చిన అక్షింతలు (శేష).
• స్వామి … నీ రూపం తో ఈ మంగళకరమైన (శుభ) యజ్ఞ కర్మ లో సమర్థుడగుదును (కల్ప).
పసుపు పచ్చని (పీత) నీ అలంకరణము. (భూషణం) శుభకరం.
• స్వామి … నీ నిర్మలత్వం తో (విమలము) సమస్తము (సర్వ) ఉత్తమము (శ్రేష్టంబు) అగును.
జగమంతయు (సర్వ) లక్ష్మి ప్రదమై (శ్రీకరం) నీ చే మిక్కిలి ప్రకాశమవుతుంది (విరాజమానము).
• స్వామి … దేవభాష అయిన సంస్కృతం లో (గీర్వాణము) నీ రూపం యధార్థమైన జ్ఞానం తో (సత్య జ్ఞానతః) నింపావు.
సత్యవంతమైన వివేకము (సత్య విజ్ఞత) , నీ సంపూర్ణ ముక్తి (నిర్వాణము) తో కలుగును.
• స్వామి… ప్రేమ తో ప్రకాశించెడిది (శోభిత) నీ స్వభావము (సత్వ)
మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా ఉంచేది (సత్వ సంశుద్ది) నీ దైవత్వం (దివ్యము).
యడ్ల శ్రీనివాసరావు 17 Dec 2022 9:00 pm
No comments:
Post a Comment