పలికితివి హర
• పలికితివి హర … పలికితివి శివ
పలికితివి హర … పలికితివి శివ
• నా పదము పిలుపు కే పలికితివి హర హర
నే పలుకు పదము కే పలికితివి శివ శివ
• ఏమి భాగ్యము ఎంత ధన్యము
ఏమి యోగము ఎంత భోగము
• నీ పాదము చెంత నిలిచిన ఈ పదము
నా అంతరంగమున వెలసిన ఆపాదమస్తకము.
• పలికితివి హర … పలికితివి శివ
పలికితివి హర … పలికితివి శివ
• నా పదము పిలుపు కే పలికితివి హర హర
నే పలుకు పదము కే పలికితివి శివ శివ.
• చేయి తిరగని చేతి లో నీ నామము ఉంచావు
మాట పలకని నోటి లో నీ పదము ఉంచావు.
• నీ వెక్కడున్నావు … నా తో నె కదా
నే నెక్కడున్నాను … నీ తో నె కదా
• ఏమి కృతం ఎంత సుకృతం
ఏమి చిత్తం ఎంత సంచితం
• పలికితివి హర … పిలిచితివా శివా
పలికితివి హర … పిలిచితివా శివా
• శివ శివ హర హర … శివ శివ హర హర.
ఓం నమఃశివాయ 🙏
యడ్ల శ్రీనివాసరావు 6 Dec 2022 8:30 pm .
No comments:
Post a Comment