పల్లెటూరు
• మా పల్లె లెగిసింది మా ఇల్లు వెలిగింది
మా పల్లె లెగిసింది మా ఇల్లు వెలిగింది
మా పల్లె అందాలు మా మనసు చందాలు
• ఎర్రని బురద తో వాన లో జలకాలు ఆడింది.
తెల్లని మంచు తో చలి లో గజ గజ వణికింది.
• పచ్చని పంటలను ఎలుగెత్తి చాటింది.
పైరు గాలులు తిమ్మెరల తో ఊరంతా నిండింది.
• పల్లె పడుచు లంతా ముతైదువు లై పల్లెకొచ్ఛారు.
అల్లుళ్లు హంగులతో సంక్రాంతి శోభను తెచ్చారు.
• సన్నాయి మేళం తో సరిగమలు పాడింది.
గంగిరెద్దుల గజ్జెల తో గ్రామమంతా దద్ధరిల్లింది.
• ఆవు గేదె లతో పాడి యేరు లై పారింది
గడ్డి మోపు లతో పెరడు గోకులం అయింది.
• జడగంటల జవరాళ్ల తో కళకళ ఆడింది
రంగోలి ముగ్గుల తో పల్లె పులకరించి పోయింది.
• మా పల్లె లెగిసింది మా ఇల్లు వెలిగింది
మా పల్లె లెగిసింది మా ఇల్లు వెలిగింది
మా పల్లె అందాలు మా మనసు చందాలు
• పిడక పొయ్యి తో పరమాన్నం పంచభక్ష్య మయింది.
గుడిసె లో మమతలు మరుజన్మ కు నిలిచాయి.
• చెరువు చెంత చింత చెట్టు న భూతం ఉండేది.
బువ్వ తినని రాత్రి బుడుంగున ఎత్తుకుని పోయేది.
• వేప పుల్లల తో చిగురులు చిమ చిమ లాడేవి.
మడత మంచం లో నిదుర మహా రంజుగ ఉండేది.
• మా పల్లె అందాలు మా మనసు చందాలు.
యడ్ల శ్రీనివాసరావు 6 Dec 2022, 6:30 pm
No comments:
Post a Comment