ఉడుతా ఉడుతా ఊచ్
• ఊసులు చెప్పే ఉడుతా
ఊయలెక్కితే ఎట్టా గే ...
నువు ఊయలెక్కి ఊగుతూ ఉంటే
ఊరంతా ఉరుకులు పరుగులు పెడుతున్నా రే.
• చెట్టున పండిన జాంపండు
చిట్టి చిలక కే చెందును లే
• ఉట్టి లో పెట్టిన అరటి పండు
పొట్టి పిచ్చుక కే చెందును లే.
• చెట్టు కొమ్మ న ఉంటావు
చేయి చాచిన చెంతకు రావు.
• కంటి ముందు న ఉంటావు
రెప్ప పాటు లో మాయం అవుతావు.
దాగుడు మూతలు దండాకోర్.
• తుర్రు బుర్రు పరుగుల ఉడుతా
తొందరెందుకే నీకు
• జానడంత ఉంటావు
జా .. రి ...... జా .. రి ….. పోతావు
• నీ గూడు ఎక్కడని వెతికే ది
నీ కూడు ఎట్టాగని పెట్టే ది
నీ తోడు ఎలాగ నే నయ్యేది.
• నిను చూస్తూ చూస్తూ ఉంటే
ఆవిరయ్యే ను కొందరి బరువులు
తేలికయ్యే ను ఇంకొందరి మనసులు
చిగురించే ను అందరికీ చిలిపి నవ్వులు.
దండా కోర్ = మొండి
యడ్ల శ్రీనివాసరావు 4 Dec 2022 10:30 pm.
No comments:
Post a Comment