కాలం తో కాంత
• కాలమా … ఓ కాలమా
నీ కౌగిలి లో ఎన్ని వింత లో
నీ లోగిలి లో ఎన్ని పుంత లో
• చెప్ప వే నీ చిరునామా
చెప్పగ నే చూడాలి నీ లోని అందాలు.
• కాలమా … ఓ కాలమా
నీ రుతు రాగాల తో కూసిన కోయిల లా
ఆడ పిల్ల నై నేను ఈడు పిల్ల నయ్యాను.
• కరిగే నీ కాలం
కదలదు నా లో కల కాలం
• మారే నీ రూపం
వదలదు నన్ను చిర కాలం
• మల్లె ల వసంతం తో
చిలిపి తనం చిగురించింది.
• జాజుల గ్రీష్మం తో
విరహ వేదన మురిపించింది
• కాలమా ... నీ రుతువుల రంజనాలు నాకే లే.
• చినుకుల వర్షం తో
చామంతి లా హర్షం లో మునిగాను.
• వెన్నెల శరదం లో
విరిసిన పూబంతి లా ఊగాను.
• కాలమా ... నీ రమణీయపు రాజసాలు నావే లే.
• హేమంతపు మంచు లో
లిల్లీ నై తడిసి బిగిసి ఉన్నాను.
• శిశిరం లో పారిజాత మై
ప్రకృతి లో పల్లవించి ఉన్నాను.
• కాలమా ... నీ రుజువుల రూపం నేనే లే.
• కాలమా … ఓ కాలమా
నీ రుతు రాగాలతో కూసిన కోయిల లా
ఆడ పిల్ల నై నేను ఈడు పిల్ల నయ్యాను
• కరిగే నీ కాలం
కదలదు నా లో కల కాలం
• మారే నీ రూపం
వదలదు నన్ను చిర కాలం
భావం
ఒక యువతి కాలం తో తనకు జరిగిన అనుభవాలను కాలానికి చెపుతుంది.
• కాలమా … ఓ కాలమా
నీ కౌగిలిలో ఎన్నో వింతలు, నీ కోట లో మరెన్నో బాటలు ఉన్నాయి.
చెప్పు….నీ చిరునామా చెప్పగానే వచ్చి నీ అందాలను చూస్తాను.
• కాలమా….ఓ కాలమా
నీ రుతువుల లోని రాగాలతో, కూసే కోయిల వలే ఆడపిల్ల లా ఉండే నేను, వయసు మనసు పరిణితి చెంది ఈడొచ్ఛిన పిల్ల లా అయ్యాను.
• కాలమా … నీ లోని కాలం సంవత్సరాలు గడిచేకొద్దీ కరిగి పోతూ ఉంది. కానీ నాకు, నా లోని కాలం ఎప్పటికీ స్థిరం గా అలానే ఉంటుంది….. కాలం కరిగినా నేను ఎప్పుడూ ఒకే విధంగా ఉంటాను. అని అర్థం.
• కాలమా … వాతావరణాని కి అనుగుణం గా నీ రూపం ఎలా మారినా, నన్ను చివరి వరకు వదలవు. కాలం ఎలా మారుతూ ఉన్నా నాతో ఎప్పటికీ ఉంటుంది. అని అర్థం.
• వసంత ఋతువు లో ని మల్లె లతో నాలో చిలిపి తనం చిగురించింది.
• గ్రీష్మ ఋతువు లో ని విరజాజులు నాలో విరహ వేదనను మురిపించాయి.
• కాలమా … నీ బుతువుల ద్వారా వచ్చే సంతోషాలు నా కే.
• వర్ష బుతువు లో ని చామంతులు నాలో చినుకుల వలె సంతోషం తో ముంచాయి.
• శరత్ బుతువు లో ని బంతి పువ్వు లా నాలో నిండు వెన్నెల విరిసింది.
• కాలమా … నీ రాజరికపు అందాలు నా వే.
• హేమంత ఋతువు లో ని లిల్లీ పువ్వు లా రాత్రంతా మంచులో తడిసి బిగిసుకు పోయాను.
• శిశిర ఋతువు లో రాలిన పారిజాత పువ్వు నై ప్రకృతి లో తిరిగి చిగురించడానికి సిద్దమై ఉన్నాను.
• కాలమా … నీ నిదర్శనాలకు , సౌందర్యం నే నే.
యడ్ల శ్రీనివాసరావు 30 Nov 2022 11:00 pm.
No comments:
Post a Comment