నటరాజ యోగం
• నటరాజ నీ రాజ యోగం
సంగీత సాహిత్య సాంగత్యం
• నాట్య భంగిమల సారూప్యం
సృష్టి స్థితి లయ ల సమ్మేళనం
• కళల కు కొలువై న కాంతి కోవిదుడా
కదిలేటి నీ అంగములు శ్రీ చక్ర త్రికోణాలు
• దివ్యమున నవ్యముతో శక్తి నిచ్చే దార్శనికుడా
విశ్వరంగా న తరంగాలు నీ చలన స్వరూపాలు.
• ధర్మం ఆచరణము న అజ్ఞానం చేయు దాడి పై
నిర్భయత్వం ప్రతీక నీ అరచేతి అభయ ముద్ర.
• త్రిగుణాలను ఏలేటి త్రిలోకేశ్వరా
తమో రజో సతో సమన్వయ త్రిశూలుడా
భావం
• ఈ సృష్టి శక్తి మూల స్వరూపం ఓంకార శబ్దం. అదే శివుని నాదం, సంగీతం. శబ్దానికి ఆధారం సాహిత్య పదం. ఈ రెండింటి కలయిక నటరాజ రూపం లోని శివుని కి రాజ యోగం.
• శివుడు నటరాజ రూపం లో ఈ సృష్టి చక్రము లో జరిగే ప్రతీ అంశం తన నృత్య భంగిమల ద్వారా తెలియచేస్తాడు.
• కళలకు కొలువై ప్రకాశం కలిగిన విద్వాంసుడా, చలించే నీ శరీర భాగములు అన్నియు శక్తి ఉద్భవించేటి శ్రీ చక్రం లోని త్రిభుజములు మరియు వాటి కోణాలు.
• దివ్యత్వం తో ఎప్పటి కప్పుడు నూతన శక్తి నిచ్చే విధానకర్తా , ఈ విశ్వమంతా ఆవరించిన తరంగాలు శివుడు సంచరించిన ఆనవాళ్ల గుర్తులు.
• ధర్మం అనుసరిస్తున్న సమయం లో అజ్ఞానం, చెడు తప్పకుండా తిరుగుబాటు చేస్తుంది. శివుని అరచేతి ద్వారా ఇచ్చే అభయం చెడును సంహరించడానికి ఇచ్చే ధైర్యం.
• బ్రహ్మనాదం నుండి శివుడు కనిపించినప్పుడు, సత్ (దేవ లోకం) , రజో( మానవ లోకం), తమో (పాతాళ లోకం) అనే గుణాలతో ముల్లోకాలు కనిపించాయి. ఈ మూడు గుణాలు త్రిశూలంగా చేసుకుని త్రిలోకాధినేత అయ్యాడు. వీటిని సమన్వయం చేయకుండా విశ్వాన్ని నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి శివుడు త్రిశూల రూపంలో ఈ మూడు లక్షణాలను కలిగి ఉన్నాడు.
యడ్ల శ్రీనివాసరావు 3 Nov 2022 10:00 AM.
No comments:
Post a Comment