కవి మంజరి
• మంజరి … ఓ మంజరి
• నా మది లో వెలసిన ఈ కావ్యమంజరి
• ఏ సిగ లో చేరునో
అదియే నా స్వర్ణ మంజరి.
• నా పదము ల రూపు తో
పరువం నిండిన కుసుమమా
• నీ పలకరింపు తో
ఈ సమయం పరిమళం .
• నా మనసే మలయమారుతం.
• మంజరి … ఓ మంజరి
• నా మది లో వెలసిన ఈ కావ్యమంజరి
• ఏ సిగ లో చేరునో
అదియే నా స్వర్ణ మంజరి.
• నా రంగు ల "కల" ము న విరిసిన
హంగు లే నీ లావణ్యం.
• నీ ఊగిసలాట తో
ఈ కాలం సుందరం.
• నా జీ "వనం" హరివిల్లు.
• నీ తేజం వాడి నా
నా పదం వీడ దు.
• నీ అందం మెరిసి నా
నా స్తోత్రం తరగ దు.
• ఇలలో వెలసిన ప్రకృతి నీవు
• కళతో కొలిచిన కావ్యము నేను
• కలవని కలిమి తో
కొలువై ఉంటాము కలకాలం.
• మంజరి … ఓ మంజరి
• నా మది లో వెలసిన ఈ కావ్య మంజరి
• ఏ సిగ లో చేరునో
అదియే నా స్వర్ణ మంజరి.
మంజరి = చిగురించిన లేత కొమ్మ నున్న తొలి పువ్వు
యడ్ల శ్రీనివాసరావు 24 Nov 2022 7:00 pm .
భావం
లేత కొమ్మ నున్న తొలి కుసుమమా ! (పుష్పం)
నా మనసు లో ఉదయించిన ఈ కవితా పుష్పం నీవు.
ఏ సిగ లో కొలువు అవుతావో, ఆమే నాకు బంగారు పుష్పం.
నే కీర్తించిన పదముల తో రూపుదిద్దుకున్న అందమైన ఓ కుసుమమా (పువ్వు)
నీ పలకరింపు తో ఈ సమయం సుగంధ భరితం అవుతుంటే
నా మనసంతా చల్లని సేద తీరే గాలి లా అయిపోయింది.
ఓ కుసుమమా ! (పుష్పమా)
నా కలము యెక్క సిరా రంగులే, నీ రూపు రేఖల సౌందర్యం.
నువ్వు అటు ఇటు ఊయలలా ఊగిస లాడుతుంటే
ఈ కాలం అంతా చాలా సుందరంగా ఉంది.
నా జీ “వనమంంతా” ఇంద్రధనుస్సు రంగుల వలే ఉంది.
ఓ కుసుమమా ! (పుష్పమా)
నీ వికాసం వాడిపోయిన, నా పదముు నిను వీడదు.
నీ అందం ఎంత మెరిసినా , నా వర్ణన తగ్గదు.
ఈ భూమి పై అవతరించిన ప్రకృతి లో పుష్పం నీవు.
కవితా కళ నై లిఖిస్తూ, నిను కొలుస్తున్న కావ్యం నేను.
పూవు కలము కలవవు కాని, కలిసే ఉంటాయి కమ్మని కావ్యమై కల కాలం.
No comments:
Post a Comment