శివ తాండవం
• అహో తాండవం శివ తాండవం
నిత్యం అఖిలాండం సర్వం బ్రహ్మాండం
• బ్రహ్మ సర్వరీ న రుద్ర తాండవం
బ్రహ్మ అహస్సు న ఆనంద తాండవం
• అహో తాండవం శివ తాండవం
నిత్యం అఖిలాండం సర్వం బ్రహ్మాండం
• శివుని తాండవము నే సృష్టి గమ్యం
శివుని పాటవము నే భువన రహస్యం
• తాండవ మాడే తడవు నే
తంతి గా మారె గోళం.
• తంతి సఫలము నే
సమయజ్ఞత కలిగె ఖగోళం.
• విశ్వ ప్రకంపనల నాదం "ఓం" కారం.
నృత్య భంగిమల సమాహారం స్వరూపం.
నాద భంగిమల ఆకారం నిరాకారం.
అదియే అదియే శివుని రూపం.
• అహో తాండవం శివ తాండవం
నిత్యం అఖిలాండం సర్వం బ్రహ్మాండం
భావం
• అహ ….శివుడు చేసేటి ఉద్దతమైన నృత్యం విపరీతం. ఈ నృత్యం ప్రతి క్షణం నిరంతరం వెలిగే దీపం లా ఈ విశ్వం అంతా నిండి ఉంది.
• శివుడు అర్ద కల్పం బ్రహ్మ రాత్రి అంతా ఉగ్రరూపం తో, అర్ద కల్పం బ్రహ్మ పగలు అంతా ఆనందం తో నృత్యం చేస్తాడు. ప్రస్తుతం గడుస్తున్న కాలం మొత్తం బ్రహ్మ రాత్రి. కాలాన్ని కల్పం తో కొలుస్తారు.
ఒక కల్పం = (4,32,00,00,000) నాలుగు వందల ముప్పై రెండు లక్షల కోట్ల మానవ సంవత్సరాలు.
• ఈ సృష్టి యొక్క ఆవిర్భావం శివుని నృత్యం లో ఉంది. ఈ విశ్వ రహస్యమే శివుని నైపుణ్యం.
• శివుని నృత్య భంగిమల ద్వారా ఉత్పన్నమైన శక్తి కి ఈ విశ్వంలో గ్రహములు, గోళములన్నీ సన్నని తీగ వలె (flexible) అనుకూలమై , ఒక నిర్దిష్టమైన సమ శక్తి వలయాలు గా అనుసంధానించ బడినవి.
• విశ్వ ఖగోళం లో నేటికీ వినిపించే శబ్దం “ఓం”. అనేక నృత్య భంగిమల కలయిక ఒక నిజ రూపం. ఈ శబ్దం , నృత్యము ల కలయిక తో ఏ విధమైన ఆకారము కనిపించకుండా ఒక అద్భుతమైన శక్తి మాత్రమే నిండి ఉంది. ఆ శక్తి యే పరమ శివుని రూపం.
యడ్ల శ్రీనివాసరావు 6 Nov 2022 , 4:00 AM
No comments:
Post a Comment