శివుని హరివిల్లు
• రంగు రంగుల వాడు
నా శివుడు.
సృష్టి రంగము ను రంగరించే సారంగధరుడు
నా హరుడు.
• మల్లె వలె తెల్లని శాంతము తో
మౌన ముని లా
మనసులో నిలిచేటి
మంగళాకారుడు.
• మందార మంటి ఎర్రని రౌద్రుడు
దోసెడు జలము కే
సంతుష్టుడై సంబరా పడతాడు.
• రంగు రంగుల వాడు
నా శివుడు
సృష్టి రంగము ను రంగరించే సారంగధరుడు
నా హరుడు.
• చామంతి ప్రియము తో పసుపంటి
సకల శుభములను కురిపించే టి
సుమనోహరుడు.
• సంపెంగ పచ్చ తో పరిమళము విరజిల్లి
రేయి పగలు నేలూతూ చల్లగా చూచేటి
చంద్రశేఖరుడు.
• రంగు రంగుల వాడు
నా శివుడు.
సృష్టి రంగము ను రంగరించే సారంగధరుడు
నా హరుడు.
• శంఖు పుష్ప రూపాన
నీలి మేని రమ్యము తో,
నగుమోము పై నెలవంక ను
నెలకొన్న సుందరాంగుడు.
• కనకాంబర కమల కాంతితో
కనులు మూసి ధ్యానము తో
జ్ఞానము నిచ్చే కేదారేసుడు.
• రంగు రంగుల వాడు
నా శివుడు
సృష్టి రంగము ను రంగరించే సారంగధరుడు
నా హరుడు.
• నీలాంబర మంటి
నీల మేఘ *నిర్వేదం తో
*నీరాజనములు కొలువైన నిరంజనుడు.
• కురింజి పుష్పం లా
పుష్కరాన “ఊదా” డే
ఉదకము న పుష్కరస్థపతుడు.
• రంగు రంగుల వాడు
నా శివుడు
సృష్టి రంగము ను రంగరించే సారంగధరుడు
నా హరుడు.
Rainbow 🌈
WHITE colour scattered splits into 7 colours
V iolet ఊదా రంగు - కురింజ పుష్పం
I ndigo నీలాకాశ వర్ణం - నీలాంబర పుష్పం
B lue నీలం - శంఖు పుష్పం
G reen పచ్చ- సంపెంగ
Y ellow పసుపు – చామంతి
O range నారింజ కమలా – కనకాంబరం
R ed ఎరుపు – మందారం
నిర్వేదం = అనంతమైన వైరాగ్యం, విరక్తి
నీరాజనములు = దీపము, పద్మము, వస్త్రము, మామిడి పండు, తమలపాకు
కురింజి = పన్నెండు సంవత్సరముల కొకసారి నీలగిరి పర్వతాలపై పూసే అరుదైన ఊదా రంగు పుష్పం.
ఊదాడే = చలనం, కదిలే, చలించే
ఉదకము = నీరు
పుష్కరస్థపతుడు = శివుడు.
యడ్ల శ్రీనివాసరావు 15 Nov 2022 2:30 pm
No comments:
Post a Comment