బుజ్జాయి
• బుల్లి బుల్లి బుడతడు
వడి వడి వస్తాడమ్మా
పడి పడి లేస్తాడమ్మా.
• బుజ్జి బుజ్జి పాదాలతో
చిట్టి పొట్టి రాగాలతో
వడి వడి వస్తాడమ్మా
పడి పడి లేస్తాడమ్మా.
• ఆదమరచి నిదురిస్తూ చంద్రుని లా
పున్నమి వెన్నెల ను తలపిస్తాడు.
• బోసి నోటి నవ్వుతో చొంగ ను కారుస్తూ
మందారం లా మకరంద మవుతాడు.
• బుజ్జి బుజ్జి పాదాలతో
చిట్టి పొట్టి రాగాలతో
వడి వడి వస్తాడమ్మా
పడి పడి లేస్తాడమ్మా.
• మాట రాని చిన్నోడు
మౌనం గా చూస్తాడు.
• సైగ లతో ఏదో చెప్పాలని
చేతు లూపుతుంటాడు.
• ఆకలి ని చెప్ప లేక
శోకము ను పెడతాడు.
• ఆ పైన
ఆనందం తో ఉంగా ... ఉంగా ... అంటూ
కన్ను కొడుతూ నే ఉంటాడు.
• బుల్లి బుల్లి బుడతడు
వడి వడి వస్తాడమ్మా
పడి పడి లేస్తాడమ్మా.
• అమ్మ పొత్తిళ్ళలో తన్నుతూ
ఎగసి ఎగసి పడతాడు.
• జోలపాట తో నిదుర లో జారుకొని
శివయ్య తో ఆటలే అడుతాడు.
• అమ్మ కౌగిలి లో వెచ్చగా
చలి కాచు కుంటాడు.
• సుతి మెత్తని స్పర్శ తో
గుండె లోతు రాగాలను వింటూ నే
• సృష్టి లోని తొలి ప్రేమ కు
శ్రీకారం చుడతాడు.
• బుల్లి బుల్లి బుడతడు
వడి వడి వస్తాడమ్మా
పడి పడి లేస్తాడమ్మా.
• బుజ్జి బుజ్జి పాదాలతో
చిట్టి పొట్టి రాగాలతో
వడి వడి వస్తాడమ్మా
పడి పడి లేస్తాడమ్మా.
వడి = వేగం గా
యడ్ల శ్రీనివాసరావు 25 Nov 2022 10:00 pm.
No comments:
Post a Comment