శివుడు ఎక్కడున్నాడు
• శివుని స్మరణ చేయ రా
చింతలన్ని చితి కి చేరు రా.
• నుదుట విభూతి ధరించ రా
దుష్ట శక్తు లేవి దరికి రావు రా.
• మూడు కన్నుల శివుడు
నీలోనే ఉన్నాడు రా
కనులు మూసి మనసు తెరిచి
బుద్ది తో చూడ రా.
• దేహం లో దాగిన
దివ్యశక్తి రూపమే శివుడు రా.
దుర్గుణాల దారిద్ర్యం లోని
నీకు కాన రాకున్నాడు రా.
• శివుని స్మరణ చేయ రా
చింతలన్ని చితి కి చేరు రా.
• నుదుట విభూతి ధరించ రా
దుష్ట శక్తు లేవి దరికి రావు రా.
• పిలిచిన పలుకుకి
పరవశమై పలికెడు వాడు శివుడు.
బ్రతుకు బాటలో
ధర్మ మనే దారి చూపేటి వాడు శివుడు.
• సుఖ దుఃఖాలు తో
ఓర్పు నేర్పు ల నిచ్చేటి వాడు శివుడు.
బంధనాల “చెద”రంగం నుండి
విముక్తి నిచ్చేటి వాడు శివుడు.
• కాల కడలి ని
నొసట నిలిపిన కాలుడు శివుడు.
మరణ సయ్యన
మృత్యువు ను ఆపేటి జయుడు శివుడు.
• శివుని స్మరణ చేయ రా
చింతలన్ని చితి కి చేరు రా.
• నుదుట విభూతి ధరించ రా
దుష్ట శక్తు లేవి దరికి రావు రా.
• అండ పిండ బ్రహ్మాండాల చైతన్యం శివం
ఆది అంత కారకాల సంయోగం శివోహం.
• శివుని చేరిన జీవి జన్మము సార్ధకం
శివుని సాంగత్యం ఆత్మ శుద్ది తోనే సాధ్యం.
• శివుని స్మరణ చేయ రా
చింతలన్ని చితి కి చేరు రా.
• నుదుట విభూతి ధరించ రా
దుష్ట శక్తు లేవి దరికి రావు రా.
• ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ.
ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ.
చితి = అగ్ని కాలుట, మంట
యడ్ల శ్రీనివాసరావు 13 Nov 2022 11:00 pm.
No comments:
Post a Comment