Monday, October 31, 2022

266. శివ నామం ( The Power)


శివ నామం

The Power


• శివ నామం   శివ నామం

  శివ నామం   శివ నామం


శివ నామం    శివ నామం

  స్వర నాదం   సమ్మోహనం

  సకల  శాస్త్రాల  సారంగం

  జీవన  వేదా న  అంతరంగం.

 

• శివ నామం     శివ నామం

  స్మృతి రాగం   యతి గానం

  సత్య  సాధ న    సోపానం

  వాణి  జ్ఞానా న   గీర్వాణం.


• శివ నామం    శివ నామం

  శివ నామం    శివ నామం


• శివ నామం    శివ నామం

  శుభ శ్రవణం   శుభ కలశం

  సర్వ దుష్కృత   సంహరణం

  అష్ట  భోగాల    సాధికారం.


• శివ నామం    శివ నామం

  సత్సంకల్పం   సర్వాభీష్టం

  అరిషడ్వర్గాల   సంహారం

  చిద్విలాసలా    వికాసం


• శివ నామం   శివ నామం

  శివ నామం   శివ నామం


• శివ నామం    శివ నామం

  సాక్షిభూతం    సాక్షాత్కారం

  ఆత్మ  చైతన్య   జాగృతం

  అభవ  విభవ   సాఫల్యం


భావం


• శివుని నామము పలుకుట చే కంఠ స్వరం    ఆకర్షణీయంగా మారుతుంది.

• శివుని నామము అనంతమైన జ్ఞాన శాస్త్రాలు కలిగిన ఏనుగు వంటి స్వరూపం.

• శివుని నామము ఒక జీవి ఎలా జీవించాలో తెలియచేసే అంతరంగం.


• శివ నామము నిత్యం  స్మృతి చేయుట వలన పద్యములు  రాగయుక్తం గా గానమవుతాయి.

• శివ నామము సత్యాన్ని అన్వేషించుటకు నిచ్చెన వంటిది.

• శివ నామము సరస్వతి దేవి పలికే జ్ఞానానికి దేవభాష వంటిది.


• శివుని నామము వినుట శుభకరం. శివ నామము పవిత్రమైన పూజా విశేషములు కలిగినటువంటి పూర్ణ కుంభం వంటిది.

• శివుని నామము పలుకుట చే సమస్త పాపాలు, కల్మషాలు నశిస్తాయి.

• శివుని నామము వలన ఎనిమిది రకాల భోగములు ఆధీనమవుతాయి.


• శివుని నామము మంచి ఆలోచనలు  కలిగించి ధర్మబద్ధమైన కోరికల్ని నెరవేరుస్తుంది.

• శివ నామం   కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యాలను సంహరిస్తుంది.

• శివ నామము వలన చిరునవ్వు తో ఉంటూ మనసు తేజోమయం అవుతుంది.


• శివుని నామము జపించుట చే  మనో నేత్రం తో సమస్తం ప్రత్యక్షంగా  సాక్షి గా చూడగలరు

• శివ నామ జపము చే ఆత్మ లోని శక్తి  చైతన్యం తో మేల్కోంటుంది.

• శివుని నామము జపము చే తదుపరి  జన్మ తీసుకోకుండా జనన మరణ చక్రం నుండి బయట పడగలరు. ఈ జన్మలో కార్యసాధన, ఐశ్వర్యం, మోక్షం సిద్ధిస్తాయి.


ఓం నమఃశివాయ 🙏


సమ్మోహనం = తన్మయం తో ఇష్ణపడుట

సారంగం = ఏనుగు

వాణి = సరస్వతి దేవి, మాట, పలుకు

గీర్వాణం = దేవభాష, సంస్కృతం

దుష్కృతము = కల్మషము, పాపము.

సాక్షి భూతం = సమస్తం చూడటం

అభవ = పునర్జన్మ లేని వాడు, ముక్తుడు

విభవ = కార్యసాధన, ఐశ్వర్యం, మోక్షం


యడ్ల శ్రీనివాసరావు. 1 November 2022 2:00 AM

















No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...