Tuesday, October 11, 2022

253. మేఘసందేశం

 

మేఘసందేశం



• మేఘమా ఓ మేఘమా

  మనసు మాధుర్యం నింపుకున్న సందేశమా

• నీలి రంగు నయనాలతో 

  ఎదురు చూపులు ఎందుకు

• నీటి బిందువుల బింబం తో 

  నిరీక్షణ ఇంకెందు


• మేఘమా ఓ మేఘమా

  మనసు మాధుర్యం నింపుకున్న సందేశమా

• చిలకరించే నీ తొలి జల్లులు

  చిటపటలై పలకరిస్తున్నాయి

• చిందు లేసేటి చినుకులతో

  చిత్తడి వుతుంది నా మనసు.

• దిగి వచ్చే ఆరాటం లో

  వయ్యారి సిగ్గు ల కంటే

  పోరాటం చేస్తున్నాయి

  నీ సూదంటి చూపులు


• మేఘమా ఓ మేఘమా

  మనసు మాధుర్యం నింపుకున్న సందేశమా

• చినుకు లోని చిత్రమా

  నను తాకిన అభీష్టమా

• కురిసే వర్షం నీవైనపుడు

  మెరిసే మెరుపు నేనవుతూ

• ఆకాశాన్ని ఆశ్రయించి చూస్తా

  అవనికి ఆరడుగుల లో విహరిస్తా


• మేఘమా ఓ మేఘమా

  మనసు మాధుర్యం నింపుకున్న సందేశమా

• నీ సందేశం తో సందడి చేస్తా

  దోసిట్లో నే బంధిస్తా

• కంఠము లో  నే పోసెస్తా

  నా ఎదలో నిను దాచెస్తా.



చిత్తడి = ఆర్దృత , తడి, చెమ్మ.

అభీష్టం = మనసులో ఉన్న బలమైన కోరిక.

అవని = భూమి, నేల


యడ్ల శ్రీనివాసరావు  11 Oct 2022 11:00 AM.





No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...