Tuesday, October 18, 2022

257. విష వలయం

 

విష వలయం



• ఎందుకు   అసలెందుకు

  జీవమే లేని   నా కే  ఎందుకు


• కాలమ నే   గమనము లో

  నే కనుమరుగై   ఉన్నపుడు


• కనుల లోని   కవితలకు

  జీవం  పోయడమెందుకు


• పడిలేచే హృదయమా

  పదనిసలు నీ కెందుకే

• అలవై ఎగర లేవు కానీ

  శిలవై శిధిలమవడానికా


• ఎందుకు  అసలెందుకు

  జీవమే  లేని  నా కే  ఎందుకు


• మరణించిన  క్షణము  నుంచి

  దేహం  దహనమై

  మనసు మనుగడ అవుతుంది.

• అది నేరమా పాపమా

• దేహమే లేని మనసును ఎలా హరించేది.


• ఎందుకు   అసలెందుకు

  జీవమే లేని  నా కే  ఎందుకు


• అక్ష“రాళ్ల”ను  రతనాలు గా   పేరుస్తూ

  రంగులద్దేటి   ఈ రచన   భవనాలెందుకు

 

• ఈ రాతలు    ఎందరికి     గుండె కోత లో

  మరెందరి కి  తలరాత లో   విధిరాత లో


• దేహం లేని   ఈ మనసు కు

  సాక్ష్యం   పంచభూతాలై

• ఈ రంగుల వలయం

  మెరిసే విష వలయం  అంటున్నాయి.


• ఏమో ఏమో   ఏమవుతుందో ఏమో

  మనసే లేని   మనుషుల తో

  ఈ మనసు ఇంకెంత కాలం ఉంటుందో.


• జననం  మరణాల  యోగం

  కర్మబంధాల  సాకారం


• బ్రహ్మ  రాసిన  జీవితం

  మనిషి  మనిషికొక   కావ్యం


• ఎందుకో అసలెందుకో

  సజీవమై   లేని   నాకు

• ఈ కర్మ   ఎందుకో  ఈశ్వరా!


యడ్ల శ్రీనివాసరావు 19 Oct 2022 , 12:30 AM.









No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...