Wednesday, October 12, 2022

254. ఆలంబనము

 

ఆలంబనము


• కన్ను లే   కలవ నీ

  కంటిపాప   కే    ఎందు కీ    కలవరం

• కలత     వయసు    దాటి     ఊగిన

  కనులు   మనసు    మాటు    దాగిన

• కనుపాప  లో    కాంతి  యే     ప్రేమ ఐ

  చల్ల  నీ   చూపు తో    సేద  నీ    పంచెనే


• కన్ను లే     కలవ నీ

  కంటిపాప   కే    ఎందు కీ     కలవరం

• దిగులు  చెంత   చేరు వై     చెదిరి న

  మనసు   కంట   నీటి లో      తడిసి న

• మలిన  మే    వదిలి    మకరంద  మే ఐ

  తియ్య ని  తేనె లా      ప్రేమ నీ   పంచె నే


• కన్ను  లే    కలవ నీ

  కంటిపాప   కే     ఎందు కీ   కలవరం

• మనసు  పొరల లో    తెరలు  కరిగి

  వాగు  వంక లై     తరలు  తుంటే

• ఆకాశ  మే   కది లి   అవకాశ మై  వచ్చి

  ఆనందమే   తెచ్చి    ప్రేమ ను   పంచె నే


• వన్నె  యే   తరగ ని

  విరజాజి కే   ఎందు కీ    వేదన.

• తెల్ల  నీ   రూపము   తేట తెల్ల మైనప్పుడు

  సుగంధ మే   వాడినా  గంధమైన చాలదా.


భావం :

చూపులు ఏనాడు సరిగా చూసుకోక పోయినా కంటిపాప కు  ఎందుకు  ఈ కలవరం.

వయసుకు మించిన బాధలు మనసు లో ఉన్న

భయ పడే చూపులు మనసు చాటున దాగి ఉన్న

కంటి పాప లో ని వెలుగే ప్రేమ అవుతూ

చల్లని చూపులతో సంతోషం పంచుతుంది.


చూపులు ఏనాడు సరిగా చూసుకోక పోయినా కంటిపాప కు  ఎందుకు ఈ  కలవరం.

ఒంటరితనం దిగులు దగ్గరకు వచ్చినా బాధపెట్టి దూరం అయిపోయిన

మనసు కన్నీళ్ల లో తడిచి ముద్దై నపుడు

దుఃఖం అంతా వదలిపోయి

మనసు తియ్యని తేనే వలే ప్రేమ ను పంచుతుంది.


చూపులు ఏనాడు సరిగా చూసుకోక పోయినా కంటిపాప కు  ఎందుకు ఈ కలవరం.

మనసు పొరలలో తెరలుగా ఉన్న బాధలు కరిగి

వాగు వంక లా ప్రవహిస్తున్నప్పుడు

ఆకాశం కదిలి అవకాశం గా వచ్చి

ఆనందం తో ప్రేమను పంచుతుంది.


అందం తగ్గని ఓ విరజాజి

ఎందుకు నీకీ వేదన

స్వచ్చమైన  నీ తెల్లటి  రూపం  

స్పష్టం గా కనిపిస్తున్నప్పుడు

నీ సుగంధం అనుకున్న వారు వీడిపోయినా 

మిగిలిన గంధం లాంటి 

ప్రేమ నిండిన నీ మనసు నీకు చాలదా.


యడ్ల శ్రీనివాసరావు 13 Oct 2022 4:40 AM.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...