Friday, October 7, 2022

251. మనిషి అనుమానం మనసు

 

మనిషి అనుమానం మనసు



• మనిషి లో అనుమానం అనేది ఒక మానసిక వైఫల్యం తో మొదలవుతుంది. ఇది ఉన్న మనిషి జీవితం సంగతి ఏమోగానీ ఇటువంటి వారితో కలిసి పయనించే వారికి ప్రత్యక్ష నరకం గా ఉంటుంది. అనుమానం ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్లు అయిపోతుంది.


• ఇటువంటి మనుషుల తో స్నేహం గాని, సహజీవనం గాని చేసే వారికి నిత్యం ప్రత్యక్ష నరకం అనుభవించ వలసి వస్తుంది.


• అనుమానం అనేది నమ్మకం లేకపోవడం వలన పుడుతుంది. ఇది ఒక psychological disorder మానసిక మైన జబ్బు. ఈ లక్షణం కలిగిన వారు మనకు జీవిత సమయం లో ఏదో ఒక విధంగా, ఎవరో ఒకరి రూపం లో తారస పడుతూనే ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే వీరి యొక్క ఈ అనుమానం జబ్బు లక్షణాన్ని ఇతరులకి ఆపాదిస్తూ వితండవాదం చేస్తారు. ఎదుటి వారు నిస్సహాయత వీరి అనుమానపు జబ్బు కి మంచి ఆహారం లా పనిచేస్తుంది. ఎందుకంటే అనుమానపు లక్షణం లేని ఎదుటి వ్యక్తి కొంత జ్ఞానం కలిగి ఉండడం వలన అనుమానం ఉన్న వారి తో మూర్ఖంగా వాదించలేడు , ఇదే అనుమానస్తులకు పెద్ద బలం అవుతుంది.


• పోనీ అనుమానం అనే లక్షణం కలిగిన వ్యక్తి అమాయకుడు, ఏమీ తెలియదు అని అనుకోనవసరం లేదు. ఎందుకంటే వీరు తమ మెదడును , ఆలోచనలను అవసరానికి మించి వాడుతూ అదేదో తమ జ్ఞానం, గొప్ప తనం అన్నట్లు భావిస్తారు . అనుమానస్తులు అనబడే వారు,   వారి  మనసు కి అన్నీ తెలిసే , ఆలోచించే ప్రవర్తిస్తూ ఉంటారు.  దీనినే తెలివి తేటలతో కూడిన చాతుర్యం గా తమలో తాము అభివర్ణించు కుంటూ మనసు లో మురిసి పోతూ ఉంటారు. అంటే అనుమానస్తుల ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే , ఎవరైనా ఏదైనా ఒకటి చెపితే దానిని పది విధాలుగా ఊహించుకోవడం, అందులో అత్యంత అల్పంగా, నీచంగా ఉన్న ఆలోచనను ఎంచుకొని అదే ఒక అస్త్రంగా అవతలి వ్యక్తి పై ప్రయోగిస్తూ హింసించడం.  తనకే  సర్వం తెలుసు అనే విధంగా ప్రవర్తిస్తూ బంధాలను నాశనం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. ఇదంతా వారికి తెలిసే కావాలని చేస్తుంటారు. ఎందుకంటే వీరు మానసిక రోగులు. వీరి కళ్లకు అందరూ వీరిలానే కనిపిస్తారు.


• విచక్షణ జ్ఞానం లేని వారు,  దేనిని అంగీకరించే తత్వం లేని వారు ,  అన్నీ నాకే తెలుసు అనుకునే వారు,  జీవితం లో ఎవరి నైనా నమ్మి మోసపోయిన వారు,  అవసరానికి మించి విపరీతంగా ఆలోచించే లక్షణం కలిగిన వారిలో ఈ అనుమానం అనే లక్షణం ప్రస్పుటంగా కనిపిస్తుంది.  దీనికి ఏ విధమైన చికిత్స, మందులు ఉండవు.  ఇది ఒకసారి మొదలైన వారిలో క్రమేపీ పెరుగుతుంది తప్పా తగ్గదు. ఎందుకంటే ఇదీ మనిషి లో అంతర్లీనంగా ఉండే జాడ్యం.


• అనుమానం ఉన్న వారికి నటనా చాతుర్యం ఒకింత ఎక్కువగా ఉంటుంది. నలుగురితో ఉన్నప్పుడు కలిసి పోయి , ప్రేమను కురిపిస్తూ చక్కగా ఉంటారు.  కానీ ఒంటరిగా, ఏకాంతంగా ఉన్న సమయంలో వీరి లోని ఈ అవ లక్షణం  ఒక వ్యంగ్య తో కొంత,  ద్వందర్ద  విధానంతో కూడిన మాటలతో కొంత,  మరికొన్ని సార్లు ప్రత్యక్షంగా కూడా  చూపిస్తుంటారు.


• అనుమానం అనే రోగం తో ఉన్న వారి వలన తప్పకుండా చుట్టూ ఉన్న బంధాలలో ఉన్నవారికి నిరంతరం నరకం, యాతన ఉంటుంది. ఎందుకంటే వీరితో రోజులు గడిచే కొద్దీ ఎలా ప్రవర్తించాలో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో కూడా అర్దం కాక మిగిలిన వారు కూడా మానసికంగా నలిగి పోతుంటారు. అప్పుడే వివాదాలు ప్రారంభం అవుతాాయి.


• ఇటువంటి  వారికి  ఒకటే  మందు  అది  ఏంటంటే   “ కుక్క కాటుకు చెప్పు దెబ్బ”.


• అయితే ఈ అనుమానం అనేది పుట్టిన ప్రతీ మనిషి లోని స్వతహాగా కొంత ఉంటుంది. ఎలా అంటే  ఏదైన ఒక అంశం లో ఇది నిజమా కాదా అనే నిర్దారణ చెయ్యాలంటే suspect అనుమానించడం అనే లక్షణం తోనే సిద్దాంత పరంగా పరీక్ష చేసి వాస్తవాన్ని నిర్ణయం చేస్తుంటారు. ఇది ఒక సంస్కారం తో కూడిన విజ్ఞానవంతమైన విధానం. కానీ దీనికి అతీతంగా మనుషులు  ఒక  బలహీనత తో  సాటి మనుషులపై చూపించేే  అనుమానం  మాత్రం నీచమైన లక్షణం.


• మనిషి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండక పోయినా పరవాలేదు కానీ అతి సామాన్యమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే చాలు…. ఎందుకంటే హీనమైన వ్యక్తిత్వం కలిగి ఉంటే ప్రమాదకారి గా సృష్టిలో ఒంటరిగా మిగిలి పోతాడు.


• ఈ విషయం పై ఇంత కూలంకషంగా విశదీకరించి రాయడం లో అంతరార్ధం ఏమిటంటే, అనుమానం అనే జబ్బు ఉన్న వారు, లేదంటే ఎవరైనా ఎవరినైనా అనుమానిస్తూ ఉన్నవారికి ఒక మంచి అవగాహన కలిగించే ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే అనుమానం లక్షణం ఉన్న వారికి సాటి వ్యక్తులు ఏమైనా చెప్పినా అంగీకరించరు.  ఈ అక్షరాలు చదవడం వలన మెదడు లో ఒక మంచి తరంగ శక్తి ఉద్భవించి , మానసిక విశ్లేషణ చేసుకొని అణువంత మార్పు తెచ్చుకుని లోక కల్యాణగ్రస్తులు అవుతారని……ఈశ్వరుని సంకల్పం తో రాస్తూ.....


ఓం నమఃశివాయ 🙏

యడ్ల శ్రీనివాసరావు 7 Oct 2022 9:30 PM.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...