Wednesday, October 5, 2022

250. కురింజం

 

కురింజం



• కొండ కోనలో విరిసే 

  ఎండ మావిలో ఒదిగే

• ఓ అపరంజి సుమం 

  ఈ కురువింజి కుసుమం

• పుష్కరానికి పూచే ఒక వరం 

  అది ప్రకృతి కే సోయగం

• కురివింజం 

  ఈ పశ్చిమ కనుమల కి పరవశం


• గాలి గమ్యము న నిలిచే 

  కాంతి తుల్యము న మొలిచే

• ఓ గుణమైన గుర్గీ 

  షణ్ముఖుని కంఠమున మాల వైన సర్గీ

• ప్రేమకు ఒక చిహ్నం 

  అది వల్లీ పెళ్లి కి సంగమం

• కురివింజం 

  ఈ సృష్టి కే తలమానికం


• నీలగిరుల కుంజం 

  ఈ నీలి వర్ణాల కురింజం

• విరిసి కురిసే కురింజం 

  పంచభూతాల సమతుల్యం

• కురింజాల నీలమయం 

  రతీ మన్మధుల రసమయం

• పుంజము తేజము నింపిన కురింజము 

  ప్రేమ సామ్రాజ్యానికి సంజనము.


కురింజి పువ్వులు 12 సంవత్సరాల కు ఒకసారి పశ్చిమ కనుమల లో పూస్తాయి. వీటిని వర్గీలు అని కూడా పిలుస్తారు.

నీలి వర్ణంలో ఉండడం వలన పచ్చగా ఉండే కొండల న్నీ  నీలిమయం అయి నీలగిరులుగా పిలువబడుతున్నాయి. 

ఇవి పంచభూతాల సమతుల్యం తో అంటే నీరు, గాలి, వేడి, కాంతి, తేమ అన్నీ కలిపి సమపాళ్లలో  తీసుకుని వికసిస్తాయి. 

ఈ సృష్టి కే అధ్బుతమైన ఈ కురింజి పువ్వుల దండ , కుమారస్వామి వివాహం లో  వల్లీ  దేవి వేస్తుంది. అందువలన ఈ పువ్వులు ప్రేమ కు, పెళ్లి కి  శుభ సూచకంగా భావిస్తారు.

ప్రకృతి లో వికసించిన ఈ పువ్వులు  మనసు కి ఆహ్లాదం , మనోహరం.


గుర్గీ = కురువింజి పువ్వు

షణ్ముఖుడు = కుమారస్వామి

సర్గీ = సృష్టించబడినది

గమ్యము = దారి, ప్రయాణం

తుల్యం = సమానమైన, సరిపడా

కుంజం = పొదరిల్లు

పుంజము = పోగు, రాశి

సంజనము = పుట్టిన, జన్మించిన


యడ్ల శ్రీనివాసరావు 5 Oct 2022 , 10:30 pm.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...