Friday, October 28, 2022

263. శివుని ప్రేమ

 

శివుని ప్రేమ



• పదిలం పదిలం

  పరమ శివుని ప్రేమ పదిలం

• పదిలం పదిలం

  పురంధరుని ప్రేమ పదిలం


• కను  చెమ్మలో   చిగురించిన  ప్రేమ

  కంటిపాప న  దాచి న   కైలాస వాసా

• దాచిన  దాగేది కాదు   నీ ప్రేమ

  ఆపిన   ఆగేది   కాదు   నీ బాష్పం


• గరళమును  కంఠ  దాచిన

  గంభీరము   నిండు  కలిగిన

• పార్వతిని  నిలిపావు  నీ  లోన

  ప్రేమ నే  చాటావు  ఈ జగము న

• నీ వెంత  సఖుడవు  సదానందుడా.


• పదిలం  పదిలం

  పరమ శివుని ప్రేమ పదిలం

• పదిలం పదిలం

  పురంధరుని  ప్రేమ  పదిలం

 

• సతి  నిహతి కి  దహించి

  దక్షుని  హరియించి

• వీరభద్రుడి వై   విధ్వంసం  చేసావు

  విశ్వ వీధిలో    పాగలుడి వై  తిరిగావు

• నీ ప్రేమెంత   పదిలమో  పరమేశ్వరా


• మౌనము తో   జగతి నే   మోస్తావు

  బైరాగి  వై   భువనము  నేలుతావు

• నీ ప్రేమ  నిండిన  పార్వతి 

  నీ లో  కొలువై నందుకే  కదా


• పదిలం  పదిలం

  పరమ శివుని  ప్రేమ పదిలం

• పదిలం పదిలం

  పురంధరుని  ప్రేమ  పదిలం


• విశ్వప్రేమ ను  పంచేటి  నీకు

  ఎందుకీ  స్మశాన  వైరాగ్యం

  దేనికీ  నిశ్శబ్ద  యుద్ధం


• నీ కంట నీరు ను   రుద్రాక్ష చేసావు

• నీ  ప్రేమ వేదన తో   యోగి గా  మారావు

• ధ్యాన యోగము తో  తన్మయుని  వైనావు.


• అంతులేని  ప్రేమ ను అదిమి ఉంచి

  రౌద్రము తో  రుద్రుడి గ   మిగిలావు

  ఎందుకీ  స్థితి  హర


• పదిలం   పదిలం

  పరమ శివుని   ప్రేమ పదిలం

• పదిలం  పదిలం

  పురంధరుని  ప్రేమ  పదిలం.


యడ్ల శ్రీనివాసరావు 29 Oct 2022 5:00 AM.





No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...