Sunday, October 23, 2022

258. జీవన దీపావళి


జీవన దీపావళి



• ఓ హో హో … ఆ హ హ

  ఆవళి ఆవళి మెరిసేను ఆవళి

  అది యే దివ్వెల దీపావళి


• ఓ హో హో … ఆ హా హా

  జావళి జావళి మురిసేను జావళి

  అది యే మల్లెల మజావళి


• వెలుగుతున్న దీపం లా

  మనసు నిండుతుంది మధురం గా.

• తరుగుతున్న చమురు లా

  తనువు నిండుకుంటుంది మధనం తో


• మధురమైన మనసు కు

  మధనపడే తనువు తో

  జత ఎందుకు…ఇంకెందుకో

 

• ఓ హో హో … ఆ హ హ

  ఆవళి ఆవళి మెరిసేను ఆవళి

  అది యే దివ్వెల దీపావళి


• ఓ హో హో … ఆ హా హా

  జావళి జావళి మురిసేను జావళి

  అది యే మల్లెల మజావళి


• లాలిపాట లాలన తో

  మనసు ఊగుతుంది మల్లె లా

• జోలపాట జావళి తో

  జీవితం నడుస్తుంది నావ లా

  అది యే మల్లెల మజావళి


• ఈ చీకటి వెలుగుల జీవనం

  శిలను శిల్పం చేసే మార్గం

  అది యే కోటి వసంతాల దీపావళి.


యడ్ల శ్రీనివాసరావు 24 Oct 2022 , 10:30 AM.








No comments:

Post a Comment

491. చిన్న పిల్లలు

చిన్న పిల్లలు • మనం ఎప్పుడైనా కాస్త ప్రశాంతంగా చిన్న పిల్లలను గమనిస్తే,  ముఖ్యం గా   పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు లో పిల్లలలో ఉండే ఆనంద...